Ready for elections in AP

 ఏపీలో ఎన్నికలకు సిద్ధమౌతున్ననాయకులు

Date:14/02/2018
విజయవాడ ముచ్చట్లు:
 2019 ఎన్నిక‌ల‌కు… ఇంకా ఏడాది టైముంది… ఇప్పుడేమి కంగారు అనుకుంటున్నారా.. నేతాశ్రీలో నిరాశలతో… ఇప్పటి నుంచే ఫ్యూచర్ ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారు. ఏపీలో రాజ‌కీయ పార్టీలు ఇప్ప‌టి నుంచి స‌న్న‌ద్దం అవుతున్న‌ట్టు క‌నిపిస్తుంది.   నిన్న మొన్న‌టి వ‌ర‌కు వైసీపీ నుంచి పెద్ద ఎత్తున టీడీపీకి వ‌ల‌స పోయారు. తాజాగా కాంగ్రెస్ నాయ‌కుల‌ను కూడా పార్టీలో చేర్చుకునేందుకు ప‌చ్చ చొక్కా నేత‌లు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ను అమ‌లు చేస్తున్నారు. వీరి ఆక‌ర్ష్ దెబ్బ‌కి వైకాపా రెక్క‌లు విరిగిన ఫ్యాన్ మాదిరిగా మారిపోయింది. స‌డెన్‌గా సీన్ రివ‌ర్స్ అయిందంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు .రోజుల‌న్నీ ఒకే విధంగా ఉండ‌వ‌న్న‌ట్టు.. టీడీపీలో  కొంద‌రి పెత్త‌నంతో  వేగ‌లేక పోతున్న‌వాళ్లు.. ఇప్పుడు వైకాపా జ‌గ‌న్ పంచ‌న చేరేందుకు రెడీ అవుతున్నార‌నే స‌మాచారం విన‌వ‌స్తోంది.ముఖ్యంగా చంద్ర‌బాబు ఇటీవ‌ల ప్ర‌క‌టించిన‌ట్టు కేబినెట్ విస్త‌ర‌ణ చేప‌డితే.. కొంద‌రు మంత్రుల‌కు ఘోర‌మైన అవ‌మానం త‌ప్ప‌ద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ముందే త‌న భ‌విష్య‌త్తును అంచ‌నా వేసిన మంత్రి రావెల కిశోర్‌బాబు  రాజ‌కీయ భ‌విష్య‌త్తు  ప‌ట్టిష్ఠం చేసుకునేందుకు ఎత్తులు వేస్తున్నార‌ట‌.  ఈ క్ర‌మంలో ఇటీవ‌ల జ‌రిగిన ఓ ప‌రిణామం దీనికి బ‌లాన్ని చేకూరుస్తోంది. ఇటీవ‌ల మంత్రి త‌న ఇంటి ద‌గ్గ‌ర అక‌స్మాత్తుగా అదృశ్య‌మ‌య్యారు. అప్ప‌ట్లో ఆయ‌న త‌న ఫ్రెండ్ ఇంటికి డిన్న‌ర్‌కి వెళ్లాన‌ని చెప్పారు. అయితే, దీనిపై అనుమానం వ‌చ్చిన సీఎం చంద్రబాబు విజిలెన్స్ ఎంక్వ‌యిరీ చేయించారు. నివేధిక బ‌హిర్గ‌తం కాకుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. విశాఖ ఉత్స‌వ్‌లో కూడా ఇద్ద‌రు మంత్రుల మ‌ధ్య విభేధాలు త‌లెత్తాయి. ఇది రోజు రోజుకు ముదిరి పాకాన‌ప‌డుతున్నాయి. బాబు త‌మ‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోతే భ‌విష్య‌త్తులో ఏం చేస్తే బాగుంటుంద‌ని మంత్రులిద్ద‌రి అనుచ‌ర వ‌ర్గంతో  మంత‌నాలుచేసుకుంటున్నారు. ఇలా సైకిల్ పార్టీలో ఇబ్బందులు వ‌స్తుండ‌టంతో వీటిని ఆధిగ‌మించేందుకు బాబు తీసుకునే నిర్ణ‌యాలే నేత‌ల భ‌విష్య‌త్తును నిర్ణ‌యిస్తాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.
Tags: Ready for elections in AP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *