రెడీ ఫర్ రిలీజ్ ఉ. పె. కు. హ

Date:13/02/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
ఏంటి మీద మీద పడుతున్నావ్.. నాక్కూడా చూపించూ.. ఏంటి నీకు చూపించేది.. ఆశ పడుతున్నాడు చూపించు అనగానే ఆరుగురు అందమైన భామలు పోటీపడి మరీ అందాలను చూపిస్తున్నారు. టాలీవుడ్‌లో ‘బాబు బాగా బిజీ’ తరువాత ఆ స్థాయి అడల్ట్ కామెడీతో సందడి చేసేందుకు వచ్చేస్తుంది. ‘ఉ. పె. కు. హ’ (ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి) మూవీ. నట కిరీటి రాజేంద్రప్రసాద్, సాక్షి చౌదరి కీలకపాత్రల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్‌ను హాట్ మసాలా దట్టించి వదిలింది చిత్ర యూనిట్. ఆరుగురు హాట్ భామలతో బ్రహ్మానందం, అలీ, ధనరాజ్, కృష్ణ భగవాన్ లాంటి టాప్ కమెడియన్లతో యమ రంజుగా శృంగార భరిత హాస్య చిత్రంగా తీర్చి దిద్దాడు దర్శకుడు నిధి ప్రసాద్‌.జేబీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ మూవీ పెద్దలకు మాత్రమే అని టీజర్‌ని బట్టి ఫిక్స్ అయిపోక తప్పదు. మితిమీరిన ఎక్స్‌పోజింగ్, అంతకు మించిన డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో అసలు సిసలు అడల్ట్ మూవీ ఎలా ఉంటుందో టీజర్‌తోటే రుచిచూపించాడు దర్శకుడు. మీ నాన్న గారు ఏం చేస్తుంటారు అంటే.. అదే చేస్తుంటారు, పాపం వీళ్లంతా పెళ్లి కోసం అలమటిస్తున్నారు, ఆడది కనిపిస్తే చాలు ఆంబోతులా నోరు తెరుచుకోవడమే లాంటి డైలాగ్స్‌తో పాటు అందాల ఆరబోతతో ‘ఉ. పె. కు. హ’ థియేటర్ల‌లో వేడిపుట్టించడం ఖాయంగానే కనిపిస్తుంది.
Tags: Ready For Release Pe. To. Ha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *