ఉద్యోగాల భర్తీకి రెడీ

అమరావతి ముచ్చట్లు:
 
ఏపీపీఎస్సీ ద్వారా 3,946 పోస్టులు భర్తీ
1,237 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్లు
వర్సిటీల్లో 2 వేల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులపై త్వరలోనే ప్రకటన
పోలీసు, మెడికల్‌ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఏర్పాట్లు
సచివాలయాల వ్యవస్థతో 1.21 లక్షల మందికి ఉద్యోగాలు
రెగ్యులర్, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ మార్గాల్లో మొత్తం 6.03 లక్షల జాబ్స్‌
2008 డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థులకు న్యాయం చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌
6 లక్షలకుపైగా పోస్టుల భర్తీతో సరికొత్త చరిత్ర
దేశ చరిత్రలో ఎక్కడా, ఏ ప్రభుత్వమూ చేయని రీతిలో…
సీఎం జగన్‌ నిరుద్యోగ అభ్యర్థులకు మేలు చేకూరుస్తున్నారు.
రెగ్యులర్‌ పోస్టులతో పాటు కాంట్రాక్టు..
అవుట్‌సోర్సింగ్‌ తదితర మార్గాల్లో ….
యువతకు ప్రయోజనం కల్పిస్తున్నారు.
2019 నుంచి ఇప్పటివరకు మొత్తం 6,03,756 పోస్టులను భర్తీ చేశారు.
ఇందులో రెగ్యులర్‌ పోస్టులు 1,84,264 ఉండగా …
కాంట్రాక్టు పోస్టులు 19,701…
అవుట్‌ సోర్సింగ్‌ పోస్టులు 3,99,791 ఉన్నాయి.
వీటిలో ప్రధానంగా సచివాలయ వ్యవస్థ ద్వారా …
1,21,518 మందికి ఉద్యోగాలు కల్పించడం గమనార్హం.
 
Tags: Ready to replace jobs

Natyam ad