రెబల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ నుంచి కలర్ ఫుల్ ‘ఈ రాతలే’ పాట ప్రోమోకు అనూహ్య స్పందన..

సినిమా  ముచ్చట్లు:
రెబల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా నుంచి ఈ రాతలే లిరికల్ వీడియో ప్రోమో విడుదలైంది. ఈ మధ్యే విడుదలైన లిరికల్ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేసారు మేకర్స్. ఈ కలర్ ఫుల్ వీడియో ప్రోమోకు అనూహ్య స్పందన వస్తుంది. ఫుల్ వీడియో సాంగ్ ఫిబ్రవరి 25న విడుదల కానుంది. ఈ పాట వెనుక కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ లిరికల్ సాంగ్ చూస్తే.. పాటలో 5 అంశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనం పంచ భూతాలుగా పిలుచుకునే నిప్పు, ఆకాశం, నీరు, భూమీ, గాలి.. ఈ లిరికల్ వీడియోలో చూపించారు. దీని కాన్సెప్టు ఏమిటంటే.. ప్రేమించే వాళ్ళ కోసం ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా అన్నింటినీ అధిగమించి వాళ్లను చేరుకోవడం. ఈ పాటలో హీరోయిన్ కోసం హీరో అలాంటి కష్టాలు పడతాడు. సినిమా విడుదలైన తర్వాత ఈ పాట గురించి పూర్తిగా ప్రేక్షకులు అర్థం చేసుకుంటారని చిత్ర యూనిట్ చెబుతున్నారు. ఇప్పుడు వస్తున్న ప్రశంసల కంటే అప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయని వాళ్ళు నమ్ముతున్నారు. గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రెబల్ స్టార్ డాక్టర్ యువి కృష్ణంరాజు ఈ సినిమాను సమర్పిస్తుండగా.. వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. రాధా కృష్ణ కుమార్ రాధే శ్యామ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ కి జోడీగా నటిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మనోజ్ పరమహంస ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకున్నారు. మార్చ్ 11, 2022న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, ప్రియదర్శి తదితరులు..
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags:Rebel star Prabhas Radhe Shyam’s unexpected response to the colorful ‘Ee Ratale’ song promo ..

Natyam ad