Recorrido en bicicleta Kodela

కోడెల సైకిల్ యాత్ర

Date:19/04/2018
గుంటూరు ముచ్చట్లు:
ఏపీ అసెంబ్లి స్పీకర్ కోడెల శివప్రసాద్  గురువారం నాడు సైకిల్ యాత్ర నిర్వహించారు. శుక్రవారం  సీఎం చంద్రబాబు చేపట్టబోయే ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా, ఏపీకి ప్రత్యేక హోదా కోసం కోడెల సైకిల్ యాత్ర చేపట్టారు. నరసరావు పేట నుంచి ప్రజలు, కార్యకర్తలతో కలిసి కోడెల చేపట్టిన సైకిల్ యాత్ర కోటప్పకొండ వరకు కొనసాగింది. ర్యాలీలో వినుకొండ  ఎమ్మెల్యే. జీవీఆంజనేయలుతో పాటు  వేలాది మంది పాల్గోన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు చేస్తున్న ధర్మ పోరాట దీక్ష కు ప్రతి ఒక్కరు సంఘీభావం  ప్రకటించాలని కోరారు. కేంద్రం దిగి వచ్చే వరకు తమ పోరాటం ఆగదన్న కొడెల స్పష్టం చేసారు.యాత్రలో  స్వల్ప ప్రమాదం జరిగింది. కార్యకర్తలు అడ్డురావడంతో స్పీకర్  సైకిల్  పై నుంచి కింద పడ్డారు. కార్యకర్తలు, నాయకులు ఆగమని చెప్పినా ఆగని స్పీకర్ మళ్లీ సైకిల్ యాత్ర ప్రారంభించారు. దెబ్బలకన్న ఆశయం, రాష్ట్ర భవిష్యత్ ముఖ్యమని సైకిల్ యాత్రను కోనసాగించారు.
Tags:Recorrido en bicicleta Kodela

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *