ఎర్రచందనం ముఠా అరెస్టు.

అనంతపురం ముచ్చట్లు:
అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అంతరాష్ట్ర ఎర్రచందనం దొంగల ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో ఎస్ పి రామ్ మోహన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కడప జిల్లా నుండి బెంగళూరుకు ఎర్రచందనం తరలించే క్రమంలో హిందూపురం రూరల్ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ట్లు తెలిపారు.
ఈ క్రమంలో 19 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 1380 కిలోల బరువు గల 73 ఎర్రచందనం దుంగలను నాలుగు వాహనాలను సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ సుమారు రూ. 80 లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ ముఠాలో కీలకమైన ఈముఠాలో ఇద్దరు నిందితులు అంతర్రాష్ట్ర స్థాయిలో ఎర్రచందనం అక్రమరవాణాకు పాల్పడుతున్నట్లు తెలిసిందన్నారు.
అరెస్టయిన వారిలో కడప జిల్లాకు చెందిన జంగాల శివశంకర్, దొడ్డినారాయణ, పెరికల చంద్రశేఖర్, సతీష్, చిత్తూరు జిల్లాకు చెందిన జె. నాగేంద్ర, తాడిపత్రి కి చెందిన కోడూరు మధుసూదన్, సిరోళ్ రాజాకుల్లాయప్ప, బీమర్జున, తమిళనాడుకు చెందిన కె. రవిలు ఉన్నారన్నారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ముద్దాయిలను రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. హిందూపురము రూరల్ సర్కిల్ సి. ఐ. పి. హమీద్ ఖాన్, చిలమత్తూరు యస్. ఐ. జి. రంగడు యాదవ్, సిబ్బందిని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప అభినందించారు.
 
Tags:Red sandalwood gang arrested

Natyam ad