పుంగనూరులో నాడు-నేడు క్రింద నిధులు విడుదల

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపాలిటి, మండలంలోని 6 పాఠశాలలకు నాడు-నేడు పథకం క్రింద రూ.4.26 కోట్ల రూపాయలు విడుదలైనట్లు ఎంఈవో కేశవరెడ్డి శుక్రవారం తెలిపారు. పట్టణంలోని బసవరాజ ప్రభుత్వ హైస్కూల్‌లో 10 అదనపు గదులు నిర్మించేందుకు రూ.1.20 కోట్లు, అలాగే బాలికల జెడ్పీ హైస్కూల్‌లో 8 గదులు నిర్మించేందుకు రూ.96 లక్షలు మంజూరైందన్నారు. మండలంలోని గూడూరుపల్లె జెడ్పీ హైస్కూల్‌కు రూ.63 లక్షలు, ఈడిగపల్లెకు రూ.63 లక్షలు, చండ్రమాకులపల్లెకు రూ.42 లక్షలు, పూజగానిపల్లెకు రూ.42 లక్షలు మంజూరైనట్లు ఆయన తెలిపారు. రెండవ విడత నిధులను ఖర్చు చేసి, త్వరలోనే పనులు పూర్తి చేయిస్తామని ఆయన తెలిపారు.
 
Tags; Release of funds below today-today in Punganur

Natyam ad