Release of water on perennial irrigation, drinking water projects and development works.

పెండింగ్ లో ఉన్న సాగునీరు,తాగునీటి ప్రాజెక్టులు,అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేయండి.

– పలమనేరు వైసీపీ నాయకుల డిమాండ్

Date : 03/01/2018

పలమనేరు ముచ్చట్లు:

నియోజకవర్గ పరిధిలో గత నాలుగు సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి, అసంపూర్తిగా ఉన్న సాగునీరు,తాగునీటి ప్రాజెక్టులపై తెదేపా ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని వైసీపీకోఆర్డినేటర్లు రాకేష్ రెడ్డి, సీవీకుమార్, మాజీ జెడ్పీ చైర్మన్ మొగసాల రెడ్డెమ్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక వైసీపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెదేపా ప్రభుత్వం అభివృద్ధి పేరు జపిస్తూ కాలయాపన చేస్తోందని ఆరోపించారు. నియోజకవర్గ పరిధిలోని గంగన శిరస్సు, కైగల్ జలపాతాల అభివృద్ధిని తుంగలో తొక్కిందని, హంద్రీనీవా ప్రాజెక్టు పనులను అర్దాంతరంగా నిలుపుదల చేసి ప్రజలను నట్టేట ముంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే చెల్లిందన్నారు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో రాయసీమ ప్రాంతంలోని రైతులకు సాగునీరందించే సదుద్దేశంతో హంద్రీ – నీవా ప్రాజెక్టును తీసుకొచ్చారు. అనంతపురం జిల్లా వరకు వచ్చిన కాలువ పనులను తెదేపా ప్రభుత్వం విస్మరించిందని దుయ్యబట్టారు. జిల్లాకి చెందిన వ్యక్తులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, పలమనేరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మరో మంత్రి అమరనాథ్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయడం మరిచారని విమర్శించారు. గడచిన నాలుగు విడతల జన్మభూమి కార్యక్రమాలలో ఏం సాదించారని ప్రశ్నించారు.వైఎస్సార్ హయాంలో ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్మెంటు, 108, 104 వంటి సంక్షేమ పథకాలు అద్బుతంగా పనిచేశాయని గుర్తుచేశారు. గతంలో వైఎస్సార్ పాలనలో నియోజకవర్గానికి 30 వేల గృహాలను ఇస్తే ప్రస్తుతం తెదేపా అందులో 10% గృహాలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. తప్పుడు హామీలతో గద్దెనెక్కిన తెదేపా ప్రభుత్వ విధానాలకు నిరసనగా 5 వ విడత జన్మభూమి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మొగసాల క్రిష్ణమూర్తి, నియోజకవర్గ కాపు నాయకుడు ఆకుల గజేంద్ర ప్రసాద్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెంకటేగౌడ, జిల్లా ప్రధాన కార్యదర్శి చెంగారెడ్డి, పట్టణ కన్వీనర్‌ మండీసుధ, కౌన్సిలర్ శ్యామ్ సుందర్, శశిధర్ తదితరులు పాల్గొన్నారు.

Tags : Release of water on perennial irrigation, drinking water projects and development works.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *