Release of water to RDS in two days

రెండు రోజుల్లో ఆర్డీఎస్‌కు నీటి విడుదల!

ఏపీ మంత్రితో ఫోన్‌లో మాట్లాడిన హరీశ్‌రావు

Date: 04/01/2018

హైదరాబాద్ ముచ్చట్లు:

పూర్వ మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు శుభవార్త. ఉభయ తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా తుంగభద్ర బోర్డుకు ఇండెంట్ పెట్టడంతో ఒకటిరెండు రోజుల్లో ఆర్డీఎస్ రైతులకు సాగునీరు విడుదల కానున్నది. బుధవారం ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో ఫోన్‌లో చర్చలు జరిపారు. ఉమ్మడి ఇండెంట్ పెట్టేందుకు ఇద్దరు మంత్రులు అంగీకరించడంతో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఏపీ నీటిపారుదలశాఖ కార్యదర్శి శశిభూషణ్‌రావుతో మాట్లాడారు. తుంగభద్ర నుంచి ఏపీకి 5.2 టీఎంసీలు, తెలంగాణకు 3.5 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉంది. ఈ మేరకు ఏపీ అంగీకరించడంతో ఒకటి రెండు రోజుల్లో నీరు విడుదలయ్యే అవకాశం ఉంది.

Tags: Release of water to RDS in two days

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *