Religion mask for terrorism

ఉగ్రవాదానికి మతం ముసుగు

Date: 14/12/2018

గురుదాస్‌పూర్‌ ముచ్చట్లు:

చివరికి భారతదేశంలో ఉగ్రవాదానికీ మతం ముసుగు వేస్తున్న రాజకీయ పార్టీల పెద్దలు, నాయకమ్మన్యూలు ఎక్కువయ్యారు. హిందూ ఉగ్రవాదం అనే పద ప్రయోగంతో గత యూపీఏ ప్రభుత్వం ఉగ్రవాద వ్యతిరేక పోరాటాన్ని ‘బలహీన’ పరిచిందని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పేర్కొన్నారు. 2015, జూలై 30న గురుదాస్‌పూర్‌లో జరిగిన ఉగ్రదాడిపై హోంశాఖ ఒక ప్రకటనను వెలువరించింది. పదే పదే హిందూ ఉగ్రవాదం అంటూ యూపీఏ దర్యాప్తు కోణాన్ని మళ్లించిందన్నారు. భారత దేశంలో అసలు ‘హిందూ ఉగ్రవాదం’ అనేదే లేదని రాజ్‌నాథ్‌ గతంలో కూడా వక్కాణించారు. అయితే ఆయన చెప్పేది అబద్ధ మన్నది బహిరంగ సత్యం. హిందూ ఉగ్రవాదుల అమానవీయ చర్యలతో మతానికి సంబంధమున్నదని చెప్పటం కాదు కానీ హిందూవాదుల ప్రమేయంతో దేశంలో ఎన్నో ఉగ్రదాడులు జరిగాయి. హిందూ మతానికి చెందిన రైటిస్టులు, అభివృద్ధి నిరోధకులు, తిరోగమనవాదులు, అతివాదులు, మూఢ విశ్వాసులు, మౌఢ్యులు చేసినవే ఈ దాడులు. హిందూ మత విశ్వాసాలకు పూర్తిగా భిన్నమైన ‘హిందూత్వ’ సిద్ధాంతాలను అనుసరిస్తున్న వారే దేశంలో జరిగిన అనేక ఉగ్రదాడుల్లో నింది తులుగా పట్టుబడ్డారు. ముస్లిములు, సిక్కులు లేదా ఇతర మతా లకు చెందిన ఉగ్రవాదులు ఎవరైనా సరే అందరిదీ ఇదే పంథా. ఉగ్రవాదానికి మతంతో సంబంధం లేదు. ఏ మతానికి చెందిన ఉగ్రవాదైనా సరే అతను ఓ విరోధి, అతివాది, తీవ్రవాది, మూఢవిశ్వాసి, మౌఢ్యుడే అయిఉంటాడు తప్ప మరేమీ కాదు. కాబట్టి ఉగ్రవాదాన్ని మతంతో ముడిపెట్టటం సరికాదు, పేటెంటుపరమైన హక్కు కాదు, అసలు అది అన్యాయం కూడా. ఓ మతాన్ని ఉగ్రవాదమతంగా ముద్రవేసి నిందించటం తగదు. ఉగ్రవాదానికి మతం లేదన్నది ఎంత నిజమో వేర్వేరు మతా లకు చెందిన ఉగ్రవాదులు ఉన్నారన్నది కూడా అంతే నిజం. వీరి దుశ్చర్యలు, హేయమైన చర్యల వల్ల గత కొన్ని దశాబ్దాలుగా మన దేశం ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నది. దేశంలో నాటుకుపోయిన ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించి వేయటం అవసరం. ఉగ్రవాదాన్ని ఏ మతం ప్రోత్సహించదు.. అనుమతించదు. అయినా ఎంతోమంది సిక్కులు, హిందువులు, ముస్లింలు సహా ఇతర మతాలకు చెందిన వారు కూడా ఈ హేయమైన దురాగతాలకు పాల్పడుతున్నారు. దేశాన్ని అతలాకుతలం చేస్తున్నారు. ఉగ్రవాదులుగా మారుతున్న వీరు తమ మత విశ్వాసాలకు వ్యతిరేకంగా మానవత్వ విలువలను కాలరాస్తున్నారు. ఇక హోంమంత్రి ప్రకటన గురించి మాట్లాడాలంటే ఆయన వ్యాఖ్యలను ఎవరూ నమ్మరు. దేశ ప్రజలకు ఆయన మాటల్లో వాస్తవం లేదని తెలుసు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ పేలుళ్లు, మలేగావ్‌, హైదరాబాద్‌లోని మక్కామసీదు, అహ్మదాబాద్‌ మసీదులో పేలుళ్లు వంటి ఎన్నో ఘటనలే వారి దుశ్చర్యలకు సజీవసాక్ష్యాలు. ఈ ఘటనలన్నింటిలో హిందూత్వవాదులు, ఆర్‌ఎస్‌ఎస్‌ అనుచరులే నిందితులు, సూత్రధారులుగా పట్టుబడ్డారు. గత కొన్ని ఏళ్లల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ సహా హిందూత్వ సంస్థలకు చెందిన అనేకమందిపై జాతీయ దర్యాప్తు సంస్థ అనేక ఉగ్రవాద కేసులను నమోదు చేసింది. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడుల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా దాని అనుబంధ సంస్థలకు చెందిన కనీసం 10మందికి ప్రమేయం ఉన్నట్టు ప్రస్తుతం లోక్‌సభలో బీజేపీ సభ్యులు, హౌంశాఖ మాజీ కార్యదర్శి ఆర్‌.కే.సింగ్‌ వెల్లడించారు. వారందరిపై సాక్ష్యాధారాలు ఉన్నాయని ఆయన తెలిపారు. నిందితుల వివరాలను వెల్లడించారు. వారిలో కీలక వ్యక్తులుగా భావిస్తున్న సునీల్‌ జోషీ… దేవస్‌, మహౌలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త. సంఝౌతా, అజ్మీర్‌ దర్గా పేలుళ్లలో నిందితుడు. సాధ్వీ ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌తో వైరం, డబ్బు వ్యవహారం నేపథ్యంలో సునీల్‌ను అతని సహచరుడే హత్యచేశాడని అనుమానం ఉంది. సందీప్‌ డాంగే… మహౌ, ఇండోర్‌, ఉత్తరకాశీ, షాజహాన్‌ పూర్‌లలో క్రియాశీల ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారకర్త. సంఝౌతా, అజ్మీర్‌ దర్గా పేలుళ్లలో నిందితుడు. పరారీలో ఉన్నాడు. లోకేష్‌ శర్మ… డియోఘర్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ నగర కార్యవాహక్‌. సంఝౌతా, హైదరాబాద్‌ మక్కామసీదు పేలుళ్ల నిందితుడు. అరెస్టు అయ్యాడు. స్వామి ఆసీమానంద్‌… డాంగ్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖ వనవాసి కళ్యాణ్‌ పరిషత్‌తో సంబంధం ఉన్న వ్యక్తి. సంఝౌతా, హైదరాబాద్‌ మక్కా మసీదు, అజ్మీర్‌ దర్గా పేలుళ్ల నిందితుడు. అరెస్టయ్యాడు. రాజేంద్ర అలియాస్‌ సముందర్‌… ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గ విస్తారక్‌గా పనిచేసేవాడు. సంఝౌతా, హైదరాబాద్‌ మక్కామసీదు పేలుళ్ల నిందితుడు. అరెస్టు అయ్యాడు. ముకేష్‌ వాసని… గోద్రాలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త. అజ్మీర్‌ పేలుళ్ల నిందితుడు. అరెస్టు అయ్యాడు. దేవేంద్ర గుప్తా… మహౌ, ఇండోర్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారకుడు. హైదరాబాద్‌ మక్కా మసీదు పేలుళ్ల నిందితుడు. అరెస్టయ్యాడు. చంద్రశేఖర్‌ లెవె… 2007లో షాజహాన్‌పూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌. మక్కామసీదు పేలుళ్ల నిందితుడు. అరెస్టు అయ్యాడు. కమల్‌ చౌహాన్‌… ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌. సంఝౌతా, హైదరాబాద్‌ మక్కామసీదు పేలుళ్ల నిందితుడు. అరెస్టు అయ్యాడు. రాంజీ కల్సాంగ్ర… ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధుడు. సంఝౌతా, హైదరాబాద్‌ మక్కా మసీదు పేలుళ్ల నిందితుడు. పరారీలో ఉన్నాడు. ఇంకా కల్నల్‌ పురోహిత్‌, సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ వంటి పలువురు సహా హిందూత్వ మత సంస్థ అభినవ్‌ భారత్‌కు చెందినవారు మాలేగావ్‌ పేలుళ్లు తదితర ఉగ్రదాడుల్లో నిందితు లుగా ఉన్నారు. హిందూత్వ మతసంస్థలకు చెందిన ఇంతమంది అనేక ఉగ్రదాడుల్లో నిందితులుగా ఉండి, వీరిపై దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో కేసులు నడుస్తున్న విషయాన్ని హౌంమంత్రి ఎలా విస్మరించగలరు? హిందూ మతమౌఢ్య సంస్థలకు చెందిన అనేకమంది హిందూత్వ ఉగ్రవాదాన్ని పెంపొందిస్తున్నారన్నది నేడు భారతదేశం ఎదుర్కొంటున్న చేదు సత్యం. కానీ హౌం మంత్రి దీనిని పూర్తిగా పక్కనపెట్టేశారు. ఈ వాస్తవాన్ని ఆయన అసలు అంగీకరించడమే లేదు. అంగీకరించాలని కూడా ఆయన అనుకోవటం లేదు. ‘ముస్లిములందరూ ఉగ్రవాదులు కాదు అయితే ఉగ్రవాదులంతా ముస్లిములే’ అంటూ ఒకప్పటి ప్రధానమంత్రి అతల్‌ బిహారీ వాజ్‌పేయి కూడా తన చెడు అభిప్రాయాన్ని, తప్పుడు ఆలోచనను వెల్లడించారు. అలాగే ప్రస్తుత హోంమంత్రి కూడా వ్యవహరిస్తున్నారు. హిందూ ఉగ్ర వాదం పేరుతో విచారణ కోణాన్ని దారి మళ్లిస్తున్నారన్న తన మాటల్లోని ఆంతర్యమేమిటి? ఇంతకుముందు ముస్లింలను అరెస్టు చేసిన ఉగ్రదాడుల కేసులో హిందూత్వ అనుచరులైన స్వామి అసీమానంద్‌, సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ తదితరుల అరెస్టును ఉద్దేశించి ఆయన లౌక్యంగా మాట్లాడుతున్నారు. నిజంగా ఆయన మాటల గూఢార్థం అదే అయి వందలాది ప్రాణాలు తీసిన ఉగ్రదాడుల నిందితులను ఆయన సమర్థిస్తుంటే గనక ఇది చాలా గంభీరమైన అంశం. ఉగ్రవాదంపై పోరాటానికి ఇది కచ్చితమైన మార్గం కానేకాదు. కేవలం హిందువులని ఉగ్రదాడుల నిందితులను సమర్థించటం, మద్దతుపలకడం మంత్రి పక్షపాత వైఖరికి అద్దంపడుతోంది. ప్రజా నాయకులు ఇలాంటి ధోరణి, ఆలోచనలు కలిగి ఉంటే అది దేశానికి, పాలనా వ్యవ స్థకు పెను ప్రమాదంగా పరిణమిస్తుంది. ముస్లిములపై ఉన్న ఉగ్రకేసులు ముఖ్యంగా 2002 కేసులకు సంబంధించిన సాక్షులంతా విరోధులుగా మారిపోవటం ఆశ్చర్యకరంగా తోస్తోంది. ఇదంతా ఓ కుట్రలాగా ఉంది. హోంమంత్రి మాటలు వింటుంటే ఇదంతా ముందస్తు ప్రణాళిక అనిపిస్తోంది. ప్రాసిక్యూషనే స్వయంగా అలా చేయాలని సాక్షులకు సూచనలు ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఇది న్యాయవ్యవస్థకు వెన్నుపోటు లాంటిది. అయితే మన దేశానికి ఇది కొత్తేమీ కాదు. 2002 గుజరాత్‌ మారణహోమానికి సంబంధించిన చాలా కేసులను పోలీసులు మూసివేశారు. అయితే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవటంతో కొన్ని కేసులను మళ్లీ తెరవడం జరిగింది. కొన్ని కేసులు అత్యున్నత న్యాయస్థానం పర్యవేక్షణలో ఉన్నాయి. అయినాగాని న్యాయవ్యవస్థను భ్రష్టుపట్టించే కార్యకలాపాలు సాగుతూనే ఉన్నాయి. కేంద్రంలో ఎన్డీయే అధికారం చేపట్టిన తర్వాత ఈ ఆగడాలు మరింత ఊపందుకున్నాయి. రాష్ట్రాధికారం, ప్రాసిక్యూషన్ల ఈ వ్యూహాలను గుర్తించి, వీటిని సుమోటో పరిధిలోకి ఏ న్యాయస్థానం తీసుకోకపోవటం గమనార్హం. అయితే దేశంలో కొత్త నాయకత్వం వచ్చినప్పటి నుండి అజ్మీర్‌ దర్గా, మాలేగావ్‌ పేలుళ్ల కేసుల్లో నెమ్మదిగా, సున్నితంగా వ్యవహరించాలని జాతీయ దర్యాప్తు సంస్థ (నియా) నుండి తీవ్ర ఒత్తిడి ఉన్నట్లు ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రోహిణి సాలియన్‌ పేర్కొన్నారు. ఇలాంటివి దేశ ప్రజలు గమనిస్తున్నారు. అవగాహన చేసుకుంటున్నారు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌, మాలేగావ్‌ పేలుళ్ల వంటి హిందూత్వ ఉగ్రవాదానికి అద్దంపట్టే కేసుల గురించి ప్రశ్నించగా నియా వంటి సంస్థలకు స్వేచ్ఛ ఇవ్వటం ప్రహసనం (ఫార్స్‌) అవుతుందని బాబ్రీ మసీదు కేసును విచారించిన జస్టిస్‌ లిబర్హన్‌ అన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు హీరో అయిన కళ్యాణ్‌ సింగ్‌ ఓ గవర్నర్‌ అని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. అహ్మదాబాద్‌లో ముస్లిములను ఊచకోత కోసిన వారు, 2002 మారణహౌమం నిందితులు, కారకులు దేశంలో ఉన్నత హౌదాలను అనుభవిస్తూ స్వేచ్ఛగా తిరుగుతున్నారని సుప్రీంకోర్టు మాజీ జడ్జి పీబీ సావంత్‌ ఆవేదన వ్యక్తంచేశారు. దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఒక్కటే. ఉగ్రవాదానికి కులం, మతం లేదని. ప్రభుత్వం ఉగ్రవాద నియంత్రణకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్నా వాస్తవంలో సత్ఫలితాలు కానరావడం లేదు.

అమెరికాకు దీటుగా జిబౌటీలో చైనా స్థావరాలు
కార్టర్‌ డాక్ట్రిన్‌ ప్రకారం, 1980 జనవరి 24నుండీ మధ్యప్రాచ్య దేశాల్లోనూ, ఉత్తర ఆఫ్రికాలో ఆధిపత్యం సంపా దించుకోవటంలో భాగంగా యుఎస్‌ రాపిడ్‌ డెవలప్‌మెంట్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుచేసి సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌, ఈజిప్టు, పాకిస్తాన్‌, ఇరాక్‌ దేశాల్లో 2లక్షలకుపైగా అమెరికా ట్రూప్‌లను కదుపుతూ తన అయిదవ నేవీ ఫ్లోట్‌ను పర్షియ న్‌గోల్ఫ్‌. ఎర్రసముద్రం, అరేబియన్‌ సముద్రం మరియు హిందూ మహాసముద్రంలోని కొంతభాగాన్ని స్థావరంగా చేసుకుని ప్రధాన కార్యాలయంగా బహ్రెయిన్‌ను ఎంచు కుంది. దీనికితోడు జిబేటీ దేశంలో తన 4,500 ట్రూపు లతో నెలకొల్పిన కాంప్‌ లెమోనియర్‌లో యుఎస్‌ డ్రోన్‌ స్థావరాలు ఏర్పరచుకుని ఇక్కడినుండీ ఎమెన్‌,సిరియా, ఇరాక్‌, పాకిస్తాన,్‌ లిబియా మొదలగు దేశాలపై టెర్రరిజం నిర్మూలన పేరుతో డ్రోన్‌ దాడులను నిర్వహిస్తుంది. డ్రోన్‌ విమాన టెక్నాలజీ ద్వారా తనకు నచ్చని ప్రభుత్వాలను అస్థిరపరచటానికి అమెరికా పూనుకుంటున్నది. స్ట్రిమ్‌టన్‌ పరిశోధనా సంస్థ వాషింగ్టన్‌ విశ్లేషణ ప్రకారం ” డ్రోన్‌ దాడులు ప్రపంచ దేశాల సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తూ, అనవసరమైన సంక్షోభాలను సృష్టిస్తున్నాయి”. టెర్రరిజాన్ని ఎదుర్కోవటానికని అమెరికా శాశ్వతంగా ఇరాక్‌, సిరియాలకు ట్రూప్‌లను పంపించటానికి ప్రణాళికను రచిస్తూ మొత్తం మధ్యప్రాచ్య దేశాలను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవటం ద్వారా చమురు మార్కెట్టుపై అజమాయిషీని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నిస్తున్నది. ‘గత 15సంవత్సరాలుగా మధ్య ప్రాచ్య దేశాలలో జరిపిన 13 యుద్ధాలకు 65లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో అమెరికా సామ్రాజ్యవాదం కొనసాగించిన యుద్ధ ఫలితాలే నేడు నివాసాలు, ఉపాధులు కోల్పోయి ఆర్థిక వ్యవస్థలు ఛిన్నాభిన్నమై లక్షలాది ప్రజానీకం శరణార్ధులుగా పొరుగుదేశాలకు, యూరప్‌ దేశాలకు తరలిపోతున్న విషయం విదితమే! రష్యాకు వ్యతిరేకంగా బిన్‌లాడెన్‌ను ప్రోత్సహించి అల్‌ఖైదా స్థాపనకు పరోక్షపాత్ర వహించింది. ఇస్లమిక్‌ స్టేట్‌ ఆఫ్‌ సిరియా, ఇరాక్‌గా పిలవబడే ఐఎస్‌ఐఎస్‌ సంస్థ గురించి అధ్యయనం చేస్తే ఇది అమెరికా 2003లో ఇరాక్‌పై ప్రారంభించిన యుద్ధ వ్యతిరేక అరాచకవాద సంస్థగా పరిగణించవచ్చు. అమెరికా, పాలస్తీనా సమస్యను పరిష్కరించనివ్వకుండా ఇజ్రాయెల్‌ను ప్రోత్సహిస్తూనే మధ్యప్రాచ్యాన్ని రావణకాష్టంగా ఉంచుతుంది. అతి చిన్నదేశమైన జిబౌటీ 50లక్షల జనాభాతో ఉత్తరాఫ్రికా కుడికొమ్ముగా పిలవబడే ప్రాంతంలో ఉంది. 1977లో ఫ్రాన్సు వలసవాదం నుంచి విముక్తి చెంది, స్వతంత్రదేశంగా అవతరించింది. జిబౌటీకి ఉత్తరాన ఎరిట్రియా, దక్షిణాన సొమాలియా, పశ్చిమాన ఇధియోపియా దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఎర్రసముద్ర తీరంలోఉన్న జిబౌటీ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నౌకా రవాణామార్గం యొక్క బాబ్‌-ఎల్‌- మనడెబ్‌ జలసంధి ముఖద్వారంలో ఉంది. ఈ జలసంధి హిందూ మహా సముద్రాన్ని అరేబియా సముద్రం, ఎర్రసముద్రం, సూయిజ్‌కెనాల్‌ ద్వారా మధ్యధరా సముద్రాన్ని కలుపుతూ ఆసియాను యూరప్‌తో కలుపుతుంది. మధ్యప్రాచ్యంలో అతి ధనవంత దేశమైన సౌదీ అరేబియా అమెరికా సాయంతో అతి పేదరిక దేశం ఎమెన్‌పై చేస్తున్న యుద్ధానికిగల ప్రధానకారణం, కీలకమైన బాబ్‌-ఎల్‌-మనడెబ్‌ జలసంధిపై ఆధిపత్యం ఉంచుకునేందుకు ప్రయత్నించడానికే. నిత్యం రద్దీగా ఉండే ఈ జలమార్గం 40శాతం ప్రపంచ చమురురవాణాకు అత్యంత కీలకమైనది. వ్యూహాత్మక భాగంగా రవాణాను రక్షించేందుకు, మధ్యప్రాచ్యంలో అమెరికా తన ప్రాబల్యాన్ని పెంపొందించుకునేందుకు జిబౌటీని ఎన్నుకుని స్థావరాలు ఏర్పరచుకుంది. యుఎస్‌ రక్షణరంగం తన స్థావరాలను ఉంచుకున్నందుకుగాను ఏటా 63మిలియన్‌ డాలర్లను జిబౌటీ దేశానికి లీజుగా చెల్లిస్తుంది. ప్రస్తుతం ఈ స్థావరం 140కోట్ల డాలర్లతో ఆధునీకరణ దశలో ఉంది. ఎందుకో ఏంజరిగిందో గానీ, మే నెలలో యుఎస్‌ సెక్రటరీ జాన్‌ కెర్రీ జిబౌటీ పర్యటన అనంతరం జరుగుతున్న పరిణామాలు అమెరికా రక్షణరంగానికి ఒక సవాలుగా మారుతున్నాయి. ”జిబౌటీ అధ్యక్షులు గ్యులె బహిరంగంగా మాట్లాడుతూ తమకిప్పుడు ఆసియాఖండంలోని నూతన స్నేహితులతో ప్రత్యేక అవసరం ఏర్పడుతున్నది. అంటూ చైనాతో తన దేశంలో ఆర్ధిక పెట్టుబడులను ప్యాకేజీలను వెలిబుచ్చారు. జిబేటీి హార్బరు సముద్రంలేని ఇథియోపియాకు ఉపయోగపడుతూ వాణిజ్యరవాణాకు సహకరిస్తోంది. చైనా ఇథియోపియాలో రోడ్‌ అండ్‌ బెల్ట్‌ ప్రాజెక్టులో భాగంగా అడిస్‌ అబాబా నుంచి జిబౌటీ వరకు నిర్మించబోవు రైల్‌రోడ్డు ప్రాజెక్టుకు మూడువందల కోట్ల డాలర్లను ఖర్చుచేయనుంది” అంటూ ప్రఖ్యాత ఎరిట్రియా జర్నలిస్టు థామస్‌ మౌంటైన్‌ పేర్కొన్నారు. రోడ్‌ బెల్ట్‌ ఎయిర్‌ ప్రాజెక్టులో భాగంగా ఇధియోపియాలో చైనా మొత్తం 900కోట్ల డాలర్లు వెచ్చిచించనుంది. దీనికితోడు, జిటేటీ నౌకాశ్రయాన్ని 4కోట్ల డాలర్లతో నవీనీకరణ చేయుటకు ఒప్పందం కుదుర్చుకుంది. దానికంటే ముఖ్యం నౌకా రవాణా రక్షణార్ధం 10వేల ట్రూపులతో జిబౌటీలో స్థావరం ఏర్పరచుకోనుంది. చైనా ట్రూపులు జిబౌటీ ఉత్తరప్రాంతంలోని ఒబొక్‌ లో మోహరించనుంది. దీనికి సమీపంలోనే అమెరికా చిన్న మిలిటరీ స్థావరాలుకూడా ఉండటం గమనార్హం. ఇందుకుగాను అమెరికా కంటే ఎక్కువగా సంవత్సరానికి 100కోట్ల డాలర్లను లీజుగా చెల్లిస్తుంది. అగ్రరాజ్యాల పోటీని ఆసరాగా చేసుకుని, జిబేటీీ తన దేశ ఆదాయాన్ని పెంచుకుంటుంది. చైనా ఇప్పటికే 700 ట్రూపులను దింపి దక్షిణసూడాన్‌లోని తన చమురు వాణిజ్యాన్ని రక్షించుకునేందుకు, ఆఫ్రికా ఖండంతో తనకుగల 20,000కోట్ల డాలర్ల వ్యాపార వాణిజ్యాలను పరిరక్షించుకోవడానికి ప్రాధాన్యతగా ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది. చైనా జిబౌటీలో స్థావరాలను ఏర్పరచుకుంటే అమెరికా రక్షణరంగ రహస్యాలు గోప్యంగాఉంచుకోవటం కష్టం కనుక తన స్థావరాలను వేరే ప్రదేశానికి మలచుకోవటంకన్నా, ప్రజాస్వామ్యంపేరుతో మిలిటరీ తిరుగుబాటు ద్వారా జిబౌటీ ప్రభుత్వాన్ని ఇప్పుడు మార్చేసినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు థామస్‌ మౌంటైన్‌. పైగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూలదోసి నియంతృత్వ ప్రభుత్వాలను కూర్చోబెట్టడం అమెరికా సహజలక్షణం. చరిత్రలో 40దేశాల్లోపైగా ప్రభుత్వాలను కూల్చిన హీనచరిత్ర అమెరికా సామ్రాజ్యవాదానిదే. చిలీ, ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌, లిబియా, ఉక్రెయిన్‌లు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇటీవలికాలంలో తాత్కాలికంగా చైనా ఆర్థికవ్యవస్థ మందకొండిగా ఉన్నప్పటికీ, రానున్న దశాబ్దంలోగా అమెరికా ఆర్ధికవ్యవస్థనుదాటి అగ్రస్థానంలో ఉండవటానికి చైనా పావులుకదుపుతూనే ఉంది. 15వ శతాబ్దం తరువాత మొదటిసారిగా చైనా నావికాదళాలపై ప్రత్యేక శ్రద్ధ చూపి నౌకా నిర్మాణాన్ని చేపట్టింది. యుఎస్‌ నావల్‌ యుద్ధ కాలేజి న్యూపోర్టులో మాజీ సిఐఏ అధ్యక్షుడు జేమ్స్‌ఫేలెన్‌ మాట్లాడుతూ, ”చైనా 2030 నాటికి వంద జలాంతర్గాములు, 4విమాననౌకలతో పాటుగా మొత్తం 415 యుద్ధ నౌకలను కల్గి ఉంటుందని వెల్లడించారు. మే నెలలో మధ్యధరా సముద్రంలో జరిపిన రష్యా, చైనా సంయుక్త నావికా విన్యాసాలు, ఏఐఐబి స్థాపన, విదేశీవాణిజ్యం పెంచుకోటానికి తాజాగా యువాన్‌ విలువను తగ్గించటం, బులియన్‌ మార్కెట్‌లో ఎలక్ట్రానిక్‌ ఎక్ఛేంజిని షాంఘైలో ఏర్పాటుచేసి లండన్‌, న్యూయార్కు మార్కెట్లకు పోటీనివ్వటం, అమెరికా ఆసియా పివోట్‌ వ్యూహాలకు ప్రతీకారంగా స్పార్టీ దీవులను విస్తరించటం ద్వారా ఏకథృవ ఆర్ధికవ్యవస్థను చైనా పక్కకు నెట్టుటకు కృషిచేస్తూ సఫలీకృతం అవుతుంది. ఈ నేపధ్యంలో సెప్టెంబరు3న బీజింగ్‌లో జరగనున్న ఫాసిస్టు జపాన్‌పై 70వ విజయోత్సవాలు విశిష్టతను సంతరించుకోనున్నాయి. జిబౌటీ స్థావరాలు మధ్యప్రాచ్యం, ఉత్తరాఫ్రికాలో శాంతిపరిరక్షణ ద్వారా ఆర్థికాభివృద్ధికీ తద్వారా అమెరికా యుద్ధదాహ నిర్మూలనకు దోహదపడాలని ఆశిద్దాం.

Tag: Religion mask for terrorism

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *