మంజరాను తోడేస్తున్నారు…

నిజామాబాద్ ముచ్చట్లు:

కోటగిరి మండలం హంగర్గ ఫారం వద్ద ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ సంఘటన ఈ నెల 19న రాత్రి జరిగింది. 20న బాధితులు ఇసుక ఆక్రమ రవాణ వాహనం ఢీకొట్టడంతో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలని ఉదయం ధర్నాకు దిగారు. కోటగిరి మండల కాంగ్రెస్ నాయకులు మంజిరా నదిలో అక్రమంగా ఇసుకను తవ్వి అక్రమ రవాణా చేస్తున్న విషయాన్ని గుర్తించి ట్రాక్టర్‌లను పట్టుకుని తహసీల్ధార్‌కు అప్పగించారు. కోటగరి మండలంలో ఇసుక అక్రమ రవాణా మార్చి 31 వరకు అనుమతి ఉంది. అదే వే బిల్లులను పెట్టుకుని ఇసుకను రవాణా చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బిలోలిలోని దెగ్లూర్ తాలుకా పరిధిలో ఇసుక రీచ్ లకు గత ఏప్రిల్ మాసంలో ప్రభుత్వం అనుమతిచ్చింది. సెల్ గావ్, బోలేగావ్, సగ్ రెల్లి, గాంజి గావ్‌లలో ఇసుక పాయింట్ల వద్ద నుంచి మంజిరా నదిలో తవ్వకాలు జరుగుతున్నాయి.

 

 

అక్కడి నుంచి ఇసుక మహారాష్ట్ర వెళ్లకుండా కందకుర్తి, తడ్ గావ్, పోతంగల్ చెక్ పోస్టుల మీదుగా రాత్రి వేళలో సరిహద్దులను దాటిస్తున్నారు. అక్కడ ఇసుక వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకున్న జిల్లాకు చెందిన ఇసుక వ్యాపారులు అక్రమ రవాణా చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ రాత్రివేళల్లో హద్దులు దాటిస్తున్నారు.నిజామాబాద్ జిల్లా మీదుగా మహారాష్ట్రలో ఇటీవల ప్రారంభమైన ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను నిజామాబాద్, హైదరాబాద్ తరలిస్తున్నారని సమాచారం మేరకు పోలీసు శాఖ చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. బోధన్, సాలూరా చెక్ పోస్టులతో పాటు రెంజల్ మండలం కందకుర్తి వద్ద మరో చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాలోని మంజిరా పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు అడ్డు అదుపు లేకుండా సాగుతున్నాయి. దానికి తోడు మహారాష్ట్ర నుంచి ఇసుకను రవాణా చేస్తున్నారు. బోధన్ డివిజన్ పరిధిలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను, రవాణాను అక్కడ రెవెన్యూ, పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యం చేసింది. కానీ ఈ నెలలో టాస్క్ ఫోర్స్ అధికారులు పలు పోలీస్ స్టేషన్‌ల పరిధిలో రోడ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఇసుక రవాణాను అడ్డుకున్నారు. కానీ అది కొన్ని రోజుల ముచ్చటగానే మారింది. ఈ విషయంలో సీరియస్‌గా ఉన్న పోలీసు కమిషనర్ ఒకరిద్దరికి మెమోలు సైతం జారీ చేశారు. కానీ ఇసుక రవాణా మాత్రం ఇప్పటికి ఆగడం లేదు.

 

 

Post Midle

రాత్రి అయిందంటే ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. మంజీరా సరిహద్దు గ్రామాల్లో ఒకప్పుడు ప్రభుత్వం ఇసుక రీచ్‌లకు అనుమతి ఇచ్చిన ప్రాంతాల్లో తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయి.నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా బోదన్ డివిజన్ పరిధిలోని మంజీర నదిలో ఇసుక త్రవ్వకాలు రవాణాతో పాటు, మహరాష్ర్ట నుంచి ఇసుకు ఆక్రమంగా రవాణా విషయంలో ఓక ప్రజా ప్రతినిధి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మహరాష్ర్ట సరిహద్ధు నియోజకవర్గం నేత కావడంతో పోలీస్, రెవిన్యూ శాఖాధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టి నేత కావడంతో తమ పదవులకు ఎక్కడ ఎసరు వస్తుందో అని భయపడుతున్నారు అధికారులు. ఇటివల బోదన్ తహసీల్థార్ విధుల్లో చేరిన కొన్ని రోజులకు లాంగ్ లీవ్ పెట్టాడానికి ఇసుక దందాను అడ్డుకోవడమే అనే చర్చ జరుగుతుంది. కందకుర్తి, తడ్ గావ్, పోతంగల్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన అవి మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. చెక్ పోస్టుల మీదుగా జిల్లా కేంద్రానికి యుధేచ్చగా ఇసుక రవాణా అవుతుంది. జిల్లా కేంద్రంలో బోదన్ రోడ్డుతో పాటు, బైపాస్ రోడ్డు, వర్ని రోడ్డులోని పలు ప్రాంతాలలో ఇసుక డంప్ లన్ని ఆక్రమంగా రవాణా అయిన వాహనాల ద్వార రాత్రి వేళలో సరిహద్దులను దాటి వచ్చిన భారీ వాహనాల ద్వార వచ్చినవి కావడం విశేషం. ఈ నెల మొదటి వారంలో ఇసుక ఆక్రమ రవాణా గురించి పోలీస్ శాఖ సీరియస్‌గా వ్యవహరించిన ఇప్పుడు మాత్రం కళ్ల ముందే పెద్ద పెద్ద 14 టైర్ల బండిలలో టన్నుల కోద్ధి ఇసుక ఎలాంటి వే బిల్లులు లేకుండా ఇసుకను తరలిస్తుంటే రెవిన్యూ, పోలిస్, టాస్క్ పోర్స్, మైన్స్ డిపార్ట్ మెంట్ అధికారులు తమకు ఎందుకు వచ్చిన గోడవ అని అటు వైపు చూడటం మానేశారు . అధికారపార్టికి చెందిన ప్రజా ప్రతినిధి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇసుక రవాణాకు కల్లెం వేసేవారు కరువయ్యారు.

 

Tags: Removing Manjara …

Post Midle