Renewal Marriage Fix

 రేణు మ్యారేజ్ ఫిక్స్

Date:18/06/2018
చెన్నై ముచ్చట్లు:
ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో విడాకుల అనంతరం నటి రేణూ దేశాయ్ మరో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయాన ఆమే పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. అంతేకాదు ఒకానొక సందర్భంలో పవన్ వీరాభిమానులు ఆమె మరో పెళ్లి చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో మగాళ్లు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా తప్పులేదు.. తాను రెండో పెళ్లి చేసుకుంటే తప్పేంటి అన్నట్లుగా పవన్ అభిమానులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఆమె. ఈ కౌంటర్‌తో పవన్ అభిమానులు మరోసారి ఆమె జోలికి వెళ్లలేదు. దీంతో అప్పట్నుంచి తన జీవిత భాగస్వామి కోసం రేణూ వెతకడం మొదలు పెట్టారు. ఇటీవల రేణూ దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటో పోస్ట్ చేశారు. ఈ ఫొటో నిశితంగా పరిశీలిస్తే రేణూకు భాగస్వామి దొరికాడని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇద్దరూ చేయిపట్టుకున్న ఫొటోను పోస్ట్ చేయడంతో పాటు చిన్నపాటి కవితను సైతం ఆమె పోస్ట్ చేశారు. ‘నీలో నా ప్రేమ దొరికింది..  నీతో ఉంటే చాలా సంతోషంగా, శాంతంగా ఉంటాను. నా చెయ్యి పట్టుకో.. ఎప్పటికీ విడువకు. అవును.. ఆ నమ్మకాన్ని నువ్వు నాకు కల్పించావు’ అంటూ తన మనసులో భావాలను రేణూ బయటపెట్టారు. ఈ ఒక్క కవిత చాలు.. ఆమె పట్టుకున్న చెయ్యి ఎవరిదో.. ఎందుకిలా వర్ణించిందో తెలుసుకోవడానికి. దీన్ని బట్టి కాబోయే భర్తే అని స్పష్టంగా ఆమె చెప్పకనే చెప్పేశారు. పిల్లల భవిష్యత్ కోసమే ఈ పెళ్లి నిర్ణయం తీసుకుంటున్నట్లు గతంలో పలుమార్లు ఇంటర్వ్యూల్లో ఆమె స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక, కొన్ని వెబ్‌సైట్లు త్వరలో రేణూదేశాయ్ పెళ్లి పీటలెక్కనుందంటూ కథనాలను ప్రచురించేశాయి. ఇప్పుడీ వార్త.. ఇద్దరూ చేయిపట్టుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రేణూ పోస్ట్‌పై నెటిజన్లు స్పందించారు. అయితే కొందరు ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకించినప్పటికీ చాలా వరకు రేణూ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని మెచ్చుకుంటున్నారు. ‘‘ఆల్‌ ది బెస్ట్ రేణూ గారూ.. మీరు మీ పిల్లలు సంతోషంగా ఉండటమే మాకు కావాల్సింది. మీరు చాలా మంచి వారు.. అంతకు మించి శక్తిమంతమైన మహిళ’’ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు పవన్ వీరాభిమానులు ఆల్ ది బెస్ట్ వదిన గారూ.. అంటూ ఆమె ఫొటోకు కామెంట్స్ చేశారు.మొత్తానికి చూస్తే రేణూ తాను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చేసిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. అయితే మీడియా ముఖంగా మాత్రం ఆమె తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. కాగా ఈ వ్యవహారంపై మరింత స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందేనేమో. కాగా, ఆమె పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు నిజమే అయితే.. ఆ పెళ్లికి రేణూ మాజీ భర్త.. పవన్ కల్యాణ్ వెళ్తారా..?  లేదా? అనేది కూడా తెలియాల్సి ఉంది.
Tags:Renewal Marriage Fix

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *