Renuka Reddy presented Rs. 8 lakh CM Relief Fund checks

రూ.8 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన రేణుకారెడ్డి

Date: 08/01/2018

పలమనేరు ముచ్చట్లు:

ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అందిన సుమారు రూ. 8 లక్షల చెక్కులను రాష్ట్ర మంత్రి అమరనాథ్ రెడ్డి సతీమణి రేణుకారెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. స్థానిక తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. పెద్దపంజాణి మండలం ఆకులవారిపల్లెకు చెందిన షేక్ హుస్సేన్ అనే వ్యక్తికి విషజ్వరం నయం చేయడానికి రూ.61,186, చామనేరుకు చెందిన కె.ఆంజనేయులు నరాలబలహీనత,తలనొప్పి బాగుచేయుటకు రూ.41,959, గంగవరం మండలం గుండుగల్లుకు చెందిన ఇ.రాధాక్రిష్ణ వెన్నెముక,తలనొప్పి బాగుకోసం రూ. 93,285, పలమనేరు రూరల్ మండలం కాలువపల్లెకు చెందిన ఆర్.సుబ్రమణ్యం రెడ్డి అల్సర్,గ్యాస్ట్రిక్ సమస్య బాగుచేయుటకు రూ. 34,312 పలమనేరులోని టిప్పు సుల్తాన్ కు ఊపిరితిత్తుల వ్యాధిని నయం చేయుటకు రూ. 5,75009 ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను భాదితులకు ఆమె పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ చాంద్ భాషా, నాయకులు హేమంత్ కుమార్ రెడ్డి, సుధీర్ కుమార్ రెడ్డి, ఆర్బీసీకుట్టి, నవీన్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Renuka Reddy presented Rs. 8 lakh CM Relief Fund checks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *