Renukkarreddi tribute to Muni Lakshma's death

మునిలక్ష్మమ్మ మృతికి రేణుకారెడ్డి నివాళి

Date: 08/14/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

మండలంలోని గౌదమాకులపల్లె గ్రామానికి చెందిన మునిలక్ష్మమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మంత్రి అమరనాథ్ రెడ్డి సతీమణి రేణుకారెడ్డి గౌదమాకులపల్లెకు వెళ్ళి మునిలక్ష్మమ్మ భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

-పెద్దపంజాణి పంచాయితీ తెదేపా అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడుకి పితృవియోగం

పెద్దపంజాణి పంచాయితీ తెదేపా అధ్యక్షుడు వేణొగోపాల్ నాయుడుకి పితృవియోగం. వేణుగోపాల్ నాయుడి తండ్రి కృష్ణమనాయుడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతన్నాడు. కాగా వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం 2 గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచారని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న మంత్రి అమరనాథ్ రెడ్డి సతీమణి రేణుకారెడ్డి పంజాణికి చేరుకుని మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామక్రిష్ణ, మురహరిరెడ్డి, రోజాక్రిష్ణారెడ్డి, సుధాకర్ రెడ్డి, భానుప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: Renukkarreddi tribute to Muni Lakshma’s death

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *