అవసరమైన చోట్ల వెంటనే మరమ్మతులు చేయాలి

క్యూ కాంప్లెక్స్, లడ్డుప్రసాదల కౌంటర్లను పరిశీలించిన ఈవో
 
శ్రీశైలం ముచ్చట్లు:
ఫిబ్రవరి 22 నుండి మార్చి 4వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఉత్సవాలకు వివిధ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా  ఈవో లవన్నఇంజనీరింగ్, ఆలయం, లడ్డుప్రసాదాల విక్రయం భద్రతా విభాగాల అధికారులతో కలసి క్యూకాంప్లెక్స్ లడ్డూ ప్రసాదాల క్యూలైన్లు, లడ్డూ ప్రసాదాల విక్రయ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లలోని ఫ్లోరింగునకు ఎలాంటి పగుళ్ళు లేకుండా వెంటనే అవసరమైన చోట్ల తగిన మరమ్మతులు చేయాలని ఆదేశించారు.అదే విధముగా క్యూకాంప్లెక్స్ లోని అన్ని శౌచాలయాలలో శుభ్రత నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచాలన్నారు. అన్ని శౌచాలయాలలో కూడా నిరంతరం నీటి సరఫరా ఉండే విధముగా చర్యలు చేపట్టాలన్నారు.
కాంప్లెక్స్ లోని మంచినీటి కుళాయిలు, వాష్ బేసిన్లు అన్ని కూడా వినియోగానికి అందుబాటులో వుండే విధముగా చర్యలు చేపట్టలన్నారు.క్యూకాంప్లెక్స్ లో అవసరమైన చోట్ల సూచన బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. కోవిడ్ నివారణకు చర్యలకు సంబంధించిన బోర్డులను కూడా విరివిగా ఏర్పాటు చేయాలని శ్రీశైల ప్రభ విభాగాన్ని ఆదేశించారు.కాగా క్యూకాంప్లెక్స్ నందు మొత్తం 16 కంపార్టుమెంట్ల ద్వారా ఉచిత దర్శనానికి అవకాశం కల్పించబడుతుంది. అదేవిధంగా ఈ కంపార్టుమెంట్ల ద్వారా భక్తులను శీఘ్రుదర్శనానికి (రూ.200/-) ల టికెటు అనుమతించడం జరుగుతుంది.
 
 
 
అదేవిధంగా అన్నదానభవన ప్రాంగణంలో లడ్డు ప్రసాదాల విక్రయకేంద్రాలను పరిశీలించారు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న కౌంటర్లతో పాటు ఉత్సవ సమయంలో 10 నుండి 15 దాకా అదనపు కౌంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీటిలో కొన్ని కౌంటర్లను ప్రత్యేకంగా మహిళలకు కేటాయించాలన్నారు. అదేవిధముగా దివ్యాంగులకు కూడా ప్రత్యేక కౌంటరును ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా భక్తులు కోరినన్ని అడ్డుప్రసాదాలు ఇచ్చేందుకు అవసరమైన మేరకు ప్రసాదాలను సిద్ధంగా ఉంచాలన్నారు.లడ్డుప్రసాద తయారీలో కూడా ఎప్పటికప్పుడు పూర్తి శుచిశుభ్రతలను పాటిస్తుండాలని సంబంధికులను ఆదేశించారు. అదేవిధంగా ఏ మాత్రం కూడా నాణ్యత తగ్గకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు.పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు పి.మురళీ బాలకృష్ణ. సహాయ కార్యనిర్వహణాధికారులు ఎం.ఫణీధర ప్రసాద్, ఎం.హరిదాస్, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ అంజనీర్లు నరసింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి, పర్యవేక్షకులు శ్రీమతి సాయి కుమారి, వెంకటేశ్వరావు సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్లు శివారెడ్డి, సుబ్బారెడ్డి, భవన్ కుమార్, విష్ణుబాబు, ప్రణయ్, రాజారావు, వెంకటేశ్వరావు, ముఖ్యభద్రతా అధికారి నరసింహారెడ్డి తదితర సిబ్బంది పాల్గొన్నారు.
 
Tags; Repairs should be made immediately where necessary

Natyam ad