వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘స్పందన’ కార్యక్రమం

-పాల్గోన్నజిల్లా ఎస్.పి కే.కే.ఎన్.అన్బురాజన్
 
కడప ముచ్చట్లు:
 
ఫిర్యాదుదారులతో  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి ఫిర్యాదులపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు జిల్లా ఎస్.పి అన్బురాజన్ ఆదేశించారు.  ఫిర్యాదు దారులు సమీప వార్డు, గ్రామ సచివాలయాల్లో ని మహిళా పోలీసు కు  ఫిర్యాదులు అందచేయాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఫిర్యాదు దారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారుల సమస్యలను నిర్ణీత సమయంలో విచారించి పరిష్కరిస్తామని ఎస్.పి భరోసా ఇచ్చారు. జిల్లాలోని ఫిర్యాదుదారులు ‘స్పందన’  ఫిర్యాదులను వారి వారి వార్డు, గ్రామ సచివాలయంలోని మహిళా పోలీసులకు అందచేయాలని, వారు ఫిర్యాదులను జిల్లా పోలీసు కార్యాలయానికి స్కాన్ చేసి పంపడం జరుగుతుందన్నారు.  ఫిర్యాదులను సంబంధిత వార్డు, గ్రామ సచివాలయాల పరిధిలోని పోలీసు అధికారులు విచారించి న్యాయం చేస్తారని జిల్లా ఎస్.పి తెలిపారు. జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్.పి సూచించారు. ‘కరోనా’ వైరస్ తీవ్రత దృష్ట్యా వ్యయ  ప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా ఫిర్యాదు దారులకు మరింత చేరువయ్యేందుకు ఈ విధానం రూపొందించడం జరిగిందని ఎస్.పి  తెలిపారు.
గుండెపోటుతో నిరుద్యోగి మృతి
Tags: ‘Response’ program via video conference

Natyam ad