Natyam ad

నా చావుకు కారణం రెవెన్యూ అధికారులూ బాధ్యులే… చుక్కల భూమిపై ‘స్పందన’ లేదు..

– వారసత్వ హక్కు లేదు…

-అమ్మితే కొనేవారు లేరు

– అప్పులబాధ తాళలేక

Post Midle

-ఆత్మహత్య చేసుకుంటున్నా » సీఎం ఇలాకాలో రైతు బలవన్మరణం

 

కడప ముచ్చట్లు:

 

కడప జిల్లా కాజీపేట మండలం తిరుమల దీన్నే గ్రామానికి చెందిన రైతు సుబ్బారెడ్డి ఆత్మహత్య తన చావుకు , స్థానిక రెవెన్యూ అధికారులే కారణ మంటూ ఓ రైతు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సీఎం సొంత జిల్లాలోనే చోటుచేసుకుంది. వివరాలిలా.. వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేట మండలం తుడమలదిన్నెకు చెందిన రైతు వెంకట సుబ్బారెడ్డి (48) తండ్రి పేరుతో 8.29 ఎకరాల చుక్కల భూమి ఉంది. ఇతడి తండ్రి కొంతకాలం క్రితం చనిపోయాడు. వెంకటసుబ్బారెడ్డికి వ్యవసా యంలో నష్టాలు రావడంతో రూ.10లక్షల వరకు అప్పులపాలయ్యాడు. ఇవి తీర్చడానికి పొలాన్ని బేరం పెట్టాడు. పొలం తండ్రి పేరుతో ఉండటంతో కొనేం దుకు ఎవ్వరూ ముందుకురాలేదు. దీంతో ఆ పొలాన్ని తన పేరుతో మార్చాలంటూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 7 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్ళి పొలంలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకు న్నాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖాజీపేట ఎస్ఐ కుళాయప్ప, సీఐ, నరేంద్రరెడ్డి వచ్చి మృతుని జేబులో ఉన్న సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. పురుగు మందు తాగి చనిపోయినట్లు వారు తెలిపారు. ‘నేను చనిపో యాక మా భూమికి పట్టా చేసి ఇవ్వండి. అది అమ్మి అప్పులు కడతారు. నేను కోరేది ఇది ఒక్కటే’ అని సూసైడ్ నోట్లో వెంకట సుబ్బారెడ్డి.

 

Tags: Revenue officers are also responsible for my death… No ‘response’ on dotted land..

Post Midle