బాధితులకు న్యాయం చేసిన రెవెన్యూ అధికారులు

తుగ్గలి     ముచ్చట్లు:
ఆక్రమణకు గురైన భూమి ను లబ్ధిదారులకు అందజేసి బాధితులకు రెవెన్యూ అధికారులు న్యాయం చేశారని ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టి ఎం రమేష్ మాదిగ తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలంలోని ముక్కెళ్ల గ్రామంలో సర్వే నంబర్ 30/2 విస్తీర్ణంలో 5 ఎకరాల 33 సెంట్ల భూమి మాదిగ మస్తానప్ప కొనుగోలు చేసిన భూమి ఈయనకు రెవెన్యూ రికార్డులు సక్రమంగా ఉన్నాయి.ఈ భూమిని 35 సంవత్సరాలుగా ఆ గ్రామానికి చెందిన ఉన్నతమైన కులం వారు దౌర్జన్యం తో ఆక్రమించుకొని అక్రమంగా సాగు చేసుకుంటూ బాధితులైన మాదిగ మస్తానప్ప పై దౌర్జన్యం చేయడమైనది.ఈ విషయం తుగ్గలి తహసిల్దార్ కు ఎమ్ఆర్పిఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టి ఎం రమేష్ మాదిగ బాధితులతో కలిసి ఫిర్యాదు చేయగా, స్పందించిన తుగ్గలి రెవెన్యూ తహసిల్దార్ నజ్మాభాను వెంటనే మండల సర్వేయర్ కు ఆదేశాలు జారీ చేయడమైనది.తహసిల్దార్ ఆదేశాల మేరకు సర్వేయర్ గాది లింగప్ప ఆక్రమణకు గురైన భూమికు చుట్టూ  కొలతలు వేసి హద్దులు చూపించి అక్రమంగా సాగు చేస్తున్న వారిని భూమి నుండి తొలగించి బాధితుడు మాదిగ మస్తానప్ప కు  మండల సర్వేయర్ గాధి లింగప్ప చుట్టూ కొలతలు వేసి హద్దులు చూపించి బాధితుడికి న్యాయం చేయడమైనది షెడ్యూల్డ్ కులాల వారి భూములను ఉన్నతమైన కులాల వారు ఆక్రమించుకొని దౌర్జన్యాలు చేస్తే ఉపేక్షించమని, రెవెన్యూ అధికారులు అక్రమార్కులపై కఠినమైన చర్యలు తీసుకొని షెడ్యూల్డ్ కులాల వారి భూములకు రక్షణ కల్పించి అండగా ఉండి న్యాయం చేయాలని ఎమ్ఆర్పిఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టీ ఎం రమేష్ మాదిగ మాదిగ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రామాంజనేయులు మాదిగ, రంజిత్ మాదిగ,రంగస్వామి మాదిగ,గిడ్డయ్య మాదిగ,తిప్పన మాదిగ, మస్తానయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags:Revenue officials who did justice to the victims

Natyam ad