పోటీ పడుతున్న బియ్యం, జొన్నల ధరలు

Date:14/02/2018
కర్నూలు ముచ్చట్లు:
 తుంగభద్ర డ్యాంలో తగినంత వరద నీరు రాక డ్యాం నిండలేదు. రబీ సీజన్‌లో వేయాల్సిన లక్ష ఎకరాల్లో వరి పంటను రైతులు పడించలేదు. లక్ష ఎకరాలు బీడు పడిపోయింది. సోనామసూరి బియ్యంతోపాటు తెల్ల జొన్నల ధరలు కూడా పెరిగి వాటికి ఉండడంతో సగటు జీవులు, పేదలు పెరిగిన ధరలు చూసి ఆందోళన చెందుతున్నారు.గత ఏడాది బియ్యం ధర సీజన్ ప్రారంభంలో క్వింటాల్ రూ. 3వేలు ధర పలకింది. జొన్నల ధర రూ. 2200కు క్వింటాల్ కొనుగోలు కావడం జరిగింది. కాని ఈ సంవత్సరం బియ్యం, జొన్నల ధర ఒకేసారి పెరిగాయి.కానీ ఈ సంవత్సరం బియ్యం ధరలు, తెల్ల జొన్నల ధరలు సమానంగా ఉన్నాయి. సీజన్ ప్రారంభంలోనే మసూరి కొత్త బియ్యం క్వింటాల్ రూ. 3500కు చేరింది. అలాగే తెల్ల జొన్నల ధరలు కూడా రూ. 3500కు పై మాటే ఉండడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆదోని డివిజన్‌లోని కోగిలతోట, హొళగుంద, వందవాగిలి, ఎండిహళ్లి, ఇంగళదహాల్, చిన్నహరివాణం, పెద్దహరివాణం, సంతేకూడ్లూరు, హానవాల్, కౌతాళం, హాల్వి, పొదిలకుంట, బదినేహాల్, కోసిగి, కుంబళనూరు, నదిచాగి, మంత్రాలయం, మాచాపురం, నాగలదినె్న, నదీకైరవాడి, ఎమ్మిగనూరు, పెద్దకడబూరు, పెద్దతుంబళం, నందవరం, మిట్టసోమాపురం, మొదలగు గ్రామాల్లో తుంగభద్ర దిగువ కాలువ కింద వరి పంట పడించేవారు. నీరు సరఫరా లేకపోవడం వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్‌లో వేసిన వరి పంట దిగుబడి తగ్గింది. అంతేకాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బియ్యం సరఫరా కూడా నిలిచిపోవడం జరిగింది. అందువల్ల బియ్యం ధరలు సీజన్ ప్రారంభంలోనే కొత్త బియ్యం క్వింటాల్ రూ. 3500, పాత బియ్యం రూ. 4500 ధర పలుకుతుంది. ఆదోని డివిజన్‌లో చిప్పగిరి, హాలహర్వి, హొళగుంద, ఆస్పరి, మద్దికెర, దేవనకొండ ప్రాంతాల్లో ఉన్న నల్లరేగడి భూముల్లో తెల్ల జొన్న పంట రైతులు పండించే వారు. అయితే ఈ సంవత్సరం చాలా మంది రైతులు పత్తి పంట వైపు మొగ్గు చూపగా దాదాపు 40 వేల ఎకరాల్లో తెల్లజొన్న పంట వేయడం జరిగింది. అయితే వర్షాలు సకాలంలో రాకపోవడంతో తెల్ల జొన్న పంట కూడా దెబ్బతింది. అందువల్ల చాలాప్రాంతాల్లో జొన్న పంట దెబ్బతిని రైతులు నష్టపోయారు. అందువల్ల ఎన్నడూ లేని విధంగా తెల్లజొన్నలు సీజన్ ప్రారంభంలోనే క్వింటాల్ రూ. 3500కు చేరింది. ఇంక వ్యాపారులైతే రూ. 3800 నుంచి రూ. 4 వేలకు కూడా తెల్ల జొన్నలు అమ్మతున్నారు. ఈ విధంగా దిగుబడి తగ్గి బియ్యం, తెల్లజొన్నలు ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బియ్యం అవసరం ఉన్నా తక్కువ మోతాదులో కొనుగోలు చేస్తున్నారు. జొన్నల పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది. ఆదోని డివిజన్‌లో తెల్లజొన్నలను ప్రజలు ఎక్కువగా వినియోగించుకోవడం జరుగుతుంది. అందువల్ల బియ్యంతో పోటిపడి తెల్ల జొన్నలు కూడా పెరగడంతో అన్నం, రొట్టేలు కూడా తినలేని పరిస్థితి ఏర్పడిందని పేదలు వాపోతున్నారు.
Tags: Rice and maize prices

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *