రైస్ మిల్ ఆపరేటర్స్ యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక……

సుల్తానాబాద్ ముచ్చట్లు:
సుల్తానాబాద్ మండల రైస్ మిల్ ఆపరేటర్స్ యూనియన్ (సిఐటియు) జనరల్ బాడీ సమావేశం పూసల పెద్దమ్మ గుడి వద్ద జరిగింది, ఇందులో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు .ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు, ఆయన మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుండి సుల్తానాబాద్ ఏరియాలోని రైస్మిల్ ఆపరేటర్స్ యూనియన్ తమ హక్కులు, సౌకర్యాల, సాధన కోసం సమరశీల  పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించిందని, సమ్మె  చేసిందని తద్వారా రైస్ మిల్లు ఆపరేటర్స్ వేతనాల పెంపుదల, పీఎఫ్ సౌకర్యం తదితర హక్కులు సాధించుకోవడం జరిగిందని, వీరి స్ఫూర్తితో  మండలంలోని మున్సిపాలిటీ, హమాలీ, మహిళా కూలీలు తదితర రంగాల కార్మికులు సిఐటియు లో చేరార ని, స్ఫూర్తివంతమైన అటువంటి ఈ యూనియన్  రాబోయే రెండు సంవత్సరాల కాలానికి నూతన కార్యవర్గాన్ని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది అన్నారు.సుల్తానాబాద్ రైస్ మిల్లు ఆపరేటర్స్ యూనియన్ సిఐటియు మండల అధ్యక్షునిగా తాండ్ర అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా శీలం నరసయ్య, కోశాధికారిగా బండారి చంద్రయ్య, మరియు 17 మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని, రాబోయే రెండు సంవత్సరాల కాలంలో రైస్ మిల్లు ఆపరేటర్స్ సమస్యల పరిష్కారం కోసం రాజీలేని సమరశీల పోరాటాలు నిర్వహించడానికి సిద్ధం కావాలని, అందులో భాగంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మార్చి 28, 29 రెండు రోజులు దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను సుల్తానాబాద్ రైస్ మిల్లు ఆపరేటర్స్ అందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. కమిటీ చేసే కృషికి సిఐటియు జిల్లా కమిటీ సంపూర్ణ సహాయ, సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో  బ్రహ్మచారి . కిరణ్. రాజు. రాజమౌళి. సదయ్య. సంపత్. స్వామి. రాజయ్య. వెంకటేష్. రవి. శంకర్. తిలక్. మహేందర్. రమేష్. తిరుపతి. రాము. రాజేశం తదితరులు పాల్గొన్నారు.
 
Tags;Rice Mill Operators Union elects new working committee

Natyam ad