ఆర్.కె.శెల్వమణి ఘన విజయం 

ఆర్.కె.శెల్వమణి ఘన విజయం
 
నగరి ముచ్చట్లు:
ఆదివారం నాడు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన “తమిళనాడు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్” ఎన్నికల్లో అధ్యక్షుడుగా ఆర్.కె.శెల్వమణి ఘనవిజయం సాధించారు.గత నెల రోజులుగా వాడివేడిగా సాగిన ప్రచారం మూలంగా యావత్ తమిళనాడు ఆసక్తిగా ఎదురు చూసిన ఈ ఎన్నికల్లో ఆర్.కె‌. శెల్వమణి ఘనవిజయం సాధించి వరుసగా రెండవ సారి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకొన్నారు.తన ప్రత్యర్థి కె.భాగ్యరాజ్ పై 389 ఓట్ల భారీ మెజారిటీతో ఆయన గెలుపొందారు. మొత్తం 1525 ఓట్లు పోల్ కాగా, ఇందులో ఆర్.కె శెల్వమణికి 955 ఓట్లు రాగా, భాగ్యరాజ్ కు 566 ఓట్లు మాత్రమే లభించింది. దీంతో శెల్వమణి వరుసగా రెండవసారి ఈ ఎన్నికల్లో విజయం సాధించి రికార్డు సృష్టించారు.ఆయన మన రాష్ట్రానికి చెందిన నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా గారి భర్త కావడం మనందరికీ గర్వకారణం.
 
Tags: RK Selvamani solid win

Natyam ad