రోడ్డెక్కిన రైతన్న

వరంగల్ ముచ్చట్లు:
 
వరంగల్ ఏనుమముల వ్యవసాయ మార్కెట్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. .మిర్చి ధర తగ్గిచేది లేదంటూ  రైతులుల ఆందోళన కు దిగారు. ర్యాలీగా ప్రధాన గేటు వైపు వెళ్లి రోడ్డు పై నిరసన చేశారు.  రైతులు
మాట్లాడుతూ వడగళ్ల వానకు పండించిన మిర్చి పంట దిగుబడి లేక వెలవెలబోతున్న తరుణంలో ఎకరానికి 1.2 బస్తాల మిర్చి దిగుబడిని తీసుకొని మార్కెట్ కు వస్తే.మార్కెట్ దళారులు అతి తక్కువ ధరకు
కొనుగోలు చేసి మమ్మల్ని మోసం చేస్తున్నారని వాపోయారు.ఈ ధర్నా కలెక్టర్ వచ్చే వరకు కొనసాగుతుందని వెల్లడించారు. మార్కెట్లో 17200 జెండా పాట పాడు 13 వేల రూపాయలకే కొనుగోలుచేస్తున్నారని అన్నదాత మిర్చి కార్యాలయం ముట్టడించి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి మార్కెట్ ప్రధాన గేటు ముందు రాస్తారోకోకు దిగారు. వాతావరణ పరిస్థితులు వైరస్ కారణంగా ఇప్పటికే మిర్చితోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి ఎకరాకు రెండు మూడు క్వింటాళ్ల దిగుబడి వచ్చే పరిస్థితి మాత్రమే ఉందని మార్కెట్లో వ్యాపారులు తమను నిండా ముంచుతున్న అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పేరుకు మాత్రం 17000 వేల రూపాయలు అనేది మాత్రం 13 వేల లోపే నని దీంతో తమకు ఏమి గిట్టుబాటు కాదని తమకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
దాడులను అరికట్టాలి
Tags: Roadside farmer

Natyam ad