చెర్రీ బాటలో రోహిత్

Date:14/03/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
రొటీన్ కథలకు భిన్నంగా వైవిధ్యభరిత కథలను ఎన్నుకుంటూ తనకంటూ టాలీవుడ్‌లో ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు నారా రోహిత్. అయితే ఈ మధ్యకాలంలో కమర్షియల్ సినిమాలవైపు మొగ్గు చూపడంతో వరుస పరాజయాలను ఎదుర్కొంటున్నాడు. దీంతో తన పాతపంథాలో వైవిధ్యకథలతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అయ్యారు నారా రోహిత్. ఉగాది కానుకగా లాంచ్ కాబోతున్న ఈ మూవీ నారా రోహిత్‌ కెరియర్‌లో 18వ చిత్రం. ఈ మూవీలో నారా రోహిత్ మాటలు రాని వ్యక్తిగా కనిపిస్తున్నట్టు ‘వరల్డ్ ఆఫ్ ది వర్డ్ లెస్’ అనే ప్రమోషన్ క్యాప్షన్‌ని బట్టి తెలుస్తోంది. సినిమా మొత్తంలో నారా రోహిత్‌కి ఒక్కడైలాగ్‌ కూడా లేకుండా కేవలం హావభావాలతోటే కథను నడిపించే పెద్ద ప్రయోగం చేస్తున్నారు.తాజాగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగస్థలం’ మూవీలో రామ్ చరణ్.. మాటలు వినిపించని (చెవుడు) చిట్టిబాబు క్యారెక్టర్‌లో నటించి.. ఇప్పటికే విడుదలైన టీజర్‌లో మెప్పించగా.. నారా రోహిత్ ఇదే తరహాలో మాటలు రాని(మూగ) పాత్రలో నటించేందుకు రెడీ అయ్యారు. శ్రీవైష్ణవి క్రియేషన్స్ బ్యానర్‌పై నారాయణరావు అట్లూరి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ప్రస్తుతం నారా రోహిత్.. వీరభోగ వసంత రాయ, పండగాలా వచ్చాడు, ఆటనాదే వేటా నాదే చిత్రాలు సెట్ మీద ఉన్నాయి.
Tags : Rohit in Cherry Road

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *