Roja Warning for Ministers

మంత్రులకు రోజా వార్నింగ్

Date:15/02/2018
నెల్లూరు ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ హక్కులే మాకు ముఖ్యంగానీ పదవులు కాదు. మంత్రులు అచ్చం నాయుడు, సోమిరెడ్డి, గంటా శ్రీనివాస్ నోరు అదుపులో పెట్టుకోండని ఎమ్మెల్యే రోజా వార్నింగ్ ఇచ్చారు. గురువారం నాడు నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం హసనాపురం వద్ద మహిళా సదస్సుకు వెళుతూ ఆమె మీడియాతో మాట్లాడగారు. చంద్రబాబు తన పైన ఉన్న కేసులు స్టే తెచ్చుకొనేందుకు చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకున్నాడు.  క్రిమినల్ చంద్ర బాబు నాయుడని ఘాటు వ్యాఖ్యాలు చేసారు. పనికి మాలిన వాడని ఐదు సార్లు ఓడించినాన దొడ్డి దారిన ఎమ్మెల్సీగా వాటా క్రింద మంత్రి అయిన సోమిరెడ్డి ఇప్పుడు  చంద్రబాబు భజన చేస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబు చెప్పే ప్యాకేజీ ఏపీ ప్రజల చెవిలో క్యాబేజీ. గంటాశ్రీనివాస్ ఏ ఎన్నికలలో ఏ పార్టీ తరపున ఎక్కడ పోటీ చేస్తడో బ్రహ్మదేవుడుకే తెలియదని అన్నారు. తమ విద్యా సంస్థల్లో విద్యార్థులు పిట్టల్లా రాలుతున్నా పట్టించుకోని మంత్రి గంటా అని ఆమె అన్నారు. ప్రభుత్వ భూములతో బ్యాంకుల్లో 200 కోట్లు రుణాలను పంగనామాలు పెట్టిన వ్యక్తి గంటా అని ఆమె విమర్శించారు. ప్రజలకు అన్యాయం జరుగుతున్నా దొంగలా దాక్కున్న చంద్రబాబు. 17 మంది టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగి వచ్చి ప్రత్యేక హోదా ఇవ్వదా అని ఆమె ప్రశ్నించారు.
Tags; Roja Warning for Ministers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *