హనీమూన్ లో శృంగారం కేసు.

ముంబై ముచ్చట్లు:
బాలీవుడ్ శృంగార తార పూనమ్ పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఆమె జీవితం అంతా వివాదాలే.. అయితే ఆ వివాదాలన్నీ ఫేమ్ కోసం, ప్రజలు తన గురించి మాట్లాడాడుకోవడానికి చేసినవి మాత్రమే అని పూనమ్ బాహాటంగానే చెప్పుకొచ్చింది. అయితే భర్తతో గొడవలు మాత్రం నిజమని, అతడి వేధింపులు తట్టుకోలేక అతడిని నుంచి దూరమయినట్లు ఎన్నోసార్లు చెప్పింది. ఇక తాజగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా హోస్ట్ గా వ్యవహరిస్తున్న లాకప్ షోలో పూనమ్ పార్టిసిపేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో మరోసారి భర్త గురించి ఏకరువుపెట్టింది. ” నాకు కొన్నిసార్లు ఏకాంతంగా ఉండడం ఇష్టం.. మా ఇంట్లో నాకో ప్రైవేట్ స్పేస్ ఉండేది. అక్కడికి కూడా సామ్ వెళ్లనిచ్చేవాడు కాదు. ఎప్పుడు ఒంటరిగా ఉంటావ్.. నాతొ ఉండు అనేవాడు. కనీసం ఫోన్ కూడా ముట్టుకోనిచ్చేవాడు కాదు. నేనేమైనా మాట్లాడితే కొట్టడం, తిట్టడం చేసేవాడు.. ఉన్నన్ని రోజులు నరకం అనుభవించాను” అని కన్నీటిపర్యంతమైంది.ఇక పూనమ్ వ్యాఖ్యలపై మాజీ భర్త సామ్ బాంబే తీవ్రంగా స్పందించారు. పూనమ్ చెప్పే మాటలన్నీ చెత్త అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ” ఇన్నాళ్లు నేను చాలా ఓపికతో ఉన్నాను.. ఆమె ఏం అన్నా, ఏం చేసినా భరించాను.. ఇప్పుడు మాట్లాడిల్సిన సమయం వచ్చింది.. నా గురుంచి ఆమె ఏదైతే చెప్తుందో అదంతా అబద్దం.. నిజం చెప్పాలంటే మా పెళ్లి ఒక మధురానుభూతి. సాధారణంగా ఏ పెళ్లి లోనైనా గొడవలు సహజం. ఎవరైనా ఆ గొడవలను పెద్దగా చేసి చెప్తారు. మా విషయంలోనూ అదే జరిగింది. పూనమ్‌ చెప్పేదంతా పనికిరాని చెత్త. ఆమె ఎప్పుడూ వార్తల్లో ఉండాలని ఇదంతా చేస్తోంది. పెళ్లి తరువాత భార్యాభర్తలు హనీమూన్ లో శృంగారం చేసుకోరా.. నేను శృంగారం చేస్తుంటే అత్యాచారం చేస్తున్నాడని కేసు పెట్టింది. మగాళ్లు ఇలాంటి విషయాల్లో ఏమి మాట్లాడలేరు.. ఒకరి కాదు రెండు కాదు ఆమె వలన నేను 20 సార్లు పోలీస్ స్టేషన్ కి వెళ్లాను. నా నిజాయితీ నన్ను కాపాడింది. పోలీసులు కూడా నన్ను ఏమి చేయలేకపోయారు. గృహ హింస అనే ఒక్క చట్టాన్ని అడ్డుపెట్టుకొని మగాళ్లను ఇరికిస్తున్నారు. మగాడు నిజం చెప్పినా కూడా ఎవరు నమ్మరు” అని చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
 
Tags:Romance case on honeymoon

Natyam ad