గులాబీదళం వెర్సెస్ కమలం

-పార్లమెంటులో తొలి రోజు నుంచే.
 
న్యూఢిల్లీ ముచ్చట్లు:
 
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజు నుంచే టిఆర్ఎస్ నిరసనలకు దిగింది. రాష్ట్రపతి ప్రసంగాన్ని టిఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించారు. రాష్ట్రం పట్ల కేంద్రం వైఖరికి నిరసనగా రాష్ట్రపతి ప్రసంగానికి దూరంగా ఉంటున్నట్లుగా ప్రకటించారు టిఆర్ఎస్ ఎంపీలు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారు. టిఆర్ఎస్ ఎంపీలు ఈరోజు సాయంత్రానికి ఢిల్లీ చేరుకోనున్నారు. విభజన హామీలు,ఆర్ధిక సంఘం సిఫారసులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, జీఎస్టీ నిధులు సహా 23 అంశాలపై పోరాడాలని ఎంపిలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. బడ్జెట్ లో తెలంగాణకు సరైన కేటాయింపులు లేకపోతే పార్లమెంట్ లో నిరసనలు కొంసాగించాలని నిర్ణయించారు. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలపై పార్లమెంటు లోపలా బయటా పోరాడాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం కేంద్రం పై తీవ్ర ఒత్తిడి తేనున్నారు టిఆర్ఎస్.ఇదిలావుంటే పార్లమెంట్‌లో తొలి రోజు రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ ఆలయ ప్రస్తావన చేశారు. రామప్ప ఆలయం గురించి రాష్ట్రపతి మాట్లాడారు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు తీసుకొచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు.
గుండెపోటుతో నిరుద్యోగి మృతి
Tags: Rose vs. Lotus

Natyam ad