Rs. 500 crore employment opportunities

మూడు నెలల్లో రూ. 500 కోట్ల ఉపాధి పనులే లక్ష్యం

-కూలీలందరికీ 100 రోజుల పని కల్పించడమే ఆశయం

-గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడి

Date: 08/01/2018

హైదరాబాద్ ముచ్చట్లు:

ఈ ఆర్థిక సంవత్సరంలోని మిగిలిన మూడు నెలల్లో కనీసం 500 కోట్ల విలువైన పనులను పూర్తి చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులను తెలంగాణ పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ కార్యాలయంలో డీఆర్‌డీఓ (జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు)లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కింద చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ఉపాధి హమీ జాబ్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్క కూలీకి 100 రోజుల పనిదినాలు కల్పించే లక్ష్యంతో కార్యక్రమాలను రూపొందించుకోవాలని సూచించారు. రాబోయే మూడు నెలల కాలంలో (జనవరి, ఫిబ్రవరి, మార్చి) కనీసం 500 కోట్ల విలువైన వేతన పనులు చేయించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టిన గ్రామ పంచాయతీ భవనాలు, వైకుంఠ దామాలు, స్కూల్ టాయిలెట్స్, ఫార్మ్ పాండ్స్ వంటి కార్యక్రమాలన్నింటిని మార్చి 31వ తేదీ వరకు పూర్తి చేయాలన్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి వుండేలా లక్ష్యం పెట్టుకొని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపాధి హమీ కూలీలకు సంబంధించి సస్పెండ్ అకౌంట్స్‌లో జమ అయిన డబ్బులను బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతాలు తీయించి కూలీల ఖాతాల్లో జమ చేయాలని సూచించారు. ఉపాధి హమీ పథకం కింద పండ్ల తోటల పెంపకం లక్ష్యం పూర్తి చేయాలని, ఆ దిశగా ప్రజల్లో చైతన్యం తీవాలన్నారు. ఉపాధి హమీ పనుల గురించి ప్రతి గ్రామంలో మైక్ సెట్ ద్వారా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. హరిత హారంలో నాటిన మొక్కలను సంరక్షించడంతో పాటు వచ్చే సంవత్సరంలో మొక్కలను నాటడానికి కావలసిన నర్సరీలను పెంచేందుకు ఇప్పటి నుండే ప్రణాళికలు రూపొందించాలని మంత్రి జూపల్లి దిశానిర్దేశం చేశారు. అలాగే రూర్భన్ పథకం కింద మంజురైన అన్ని క్లస్టర్‌లలో పనులు ప్రారంబించి, త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాలలో వాటర్ షెడ్ కార్యక్రమంలో చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేసి భూగర్భ జలాలను పెంపొందించే ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్, అధికారులు సైదులు, జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు.

Tags: Rs. 500 crore employment opportunities

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *