Rs 600 crores, but shopping ..

విరుష్క ఆస్తులేమో రూ.600 కోట్లు, కానీ షాపింగ్‌కి..

సాక్షి

Date :01/01/2018

ఇటీవలే ఇటలీలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న విరాట్‌ కోహ్లి, అనుష్క శర్మ ఆస్తులు… పెళ్లికి ముందే రూ.600 కోట్లకు పైగా ఉన్నాయి. కానీ వీరు పెళ్లి తర్వాత షాపింగ్‌ ఎక్కడ చేశారో తెలిస్తే షాకవుతారు. సౌతాఫ్రికాలోని కేప్ టౌన్‌లో రోడ్డు పక్కన ఉన్న దుకాణాలకు వీరు షాపింగ్‌కు వెళ్లినట్లు తెలిసింది. అంతేకాక డిస్కౌంట్లు ఆఫర్‌ చేసిన షాపులకు వీరు ఆకర్షితులయ్యారని, బేరమాడి మరి తమకు కావాల్సినవి ఈ కపుల్స్ కొనుక్కున్నారట. సౌతాఫ్రికాలో జరుగనున్న తొలి టెస్ట్‌కు కొన్ని రోజుల ముందు వీరు ఈ షాపింగ్‌ చేశారు.సౌత్‌ఆఫ్రికాలోని కేప్ టౌన్‌లో అనుష్క షాపింగ్‌ చేసినట్లు విరాట్‌ కోహ్లి కూడా తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పంచుకున్నాడు.  అంతేకాక విరాట్‌ కోహ్లి, శిఖర్‌ ధావన్‌ కలిసి ఆ రోడ్లపైనే డ్యాన్స్‌ కూడా చేశారు. వీరు డ్యాన్స్‌ చేసిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కేప్ టౌన్‌లో తొలి టెస్ట్‌ మ్యాచ్‌ జరుగనుంది. జనవరి 5 నుంచి భారత్‌ 3 టెస్ట్‌లను, 6 ఓడీఐలను, 3 టీ20లను సౌతాఫ్రికాతో తలపడాల్సి ఉంది.

Tags : Rs 600 crores, but shopping ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *