Rs.99k flight ticket ..!

రూ.99కే విమాన టికెట్‌..!

ఈనాడు.

Date :15/01/2018

దిల్లీ: పండుగ సీజన్‌లో మలేషియాకు చెందిన విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియా విమాన ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ప్రయాణికులకు రూ.99కే(బేస్‌ ఛార్జి) విమాన టికెట్‌ను అందించనుంది. ప్రస్తుత మార్కెట్‌ పోటీని తట్టుకునేందుకు ఎయిర్‌ఏషియా ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఏడు నగరాల్లో అందించే సేవలపై ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. బెంగళూరు, హైదరాబాద్‌, కొచ్చి, కోల్‌కతా, న్యూదిల్లీ, పూణె, రాంచీ ప్రాంతాల్లో రూ.99కే టికెట్‌ ఆఫర్‌ వర్తించనున్నట్లు ఎయిర్‌ఏషియా ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

ప్రయాణికులు సోమవారం నుంచి జనవరి 21 వరకు ఈ ఆఫర్‌ కింద టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌లో భాగంగా టికెట్‌ బుక్‌ చేసుకున్న వారు జనవరి 15 నుంచి జులై 31 మధ్యకాలంలో ప్రయాణించవచ్చు. దీంతో పాటు ఎయిర్‌ఏషియా 10 ఆసియా-పసిఫిక్‌ రీజియన్‌(పీఏఏసీ) దేశాలకు వెళ్లే ప్రయాణికులకు రూ.1,499(బేస్‌ఛార్జి)కే టికెట్‌ అందిస్తోంది. ఆక్లాండ్‌, బాలి, బ్యాంకాంక్‌, కౌలాలంపూర్‌, మెల్‌బోర్న్‌, సింగపూర్‌, సిడ్నీ నగరాలకు ఈ ఆఫర్‌ కింద ప్రయాణించవచ్చు. ఎయిర్‌ఏషియా.కామ్‌, ఎయిర్‌ఏషియా మొబైల్‌ యాప్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకునే వారికి మాత్రమే ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ వర్తించనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఎయిర్‌ఏషియా నెట్‌వర్క్‌ ఎయిర్‌ఏషియా ఇండియా, ఎయిర్‌ఏషియా బెర్హద్‌, థాయ్‌ ఎయిర్‌ఏషియా, ఎయిర్‌ఏషియా ఎక్స్‌, ఇండోనేషియా ఎయిర్‌ఏషియా ఎక్స్‌ విమానాల్లోను ఈ ఆఫర్‌ పొందవచ్చు.

Tags : Rs.99k flight ticket ..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *