ఆర్టీసీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన

తిరుపతి ముచ్చట్లు:
ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల జేఎసీ అధ్వర్యంలో సెంట్రల్ బస్టాండు వద్ద నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఎసీ నేత సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వంలో ఆర్టీసీని
విలీనం చేసినా ఉద్యోగుల సమస్యల ఇప్పటికీ పరిష్కరం కాలేదని… అన్ని సౌకర్యాలను ప్రభుత్వం తొలగించిందన్నారు. విలీనం జరిగిందని ఆనందపడాలో…  ఉన్న వసతులు పోయినందుకు భాదపడలో
అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 15 డిపోల ఉద్యోగుల నిరసన జరుగుతోందని చెప్పారు. 2004 ముందు ఉన్న పెన్షన్ విధానాన్ని ఆర్టీసీలో అమలు చేయాలని, ఆర్టీసీ
ఉద్యోగులందరికీ పెన్షన్ కచ్చితంగా ప్రభుత్వం ఇవ్వాలని సత్యనారాయణ డిమాండ్‌ చేశారు.
 
Tags: RTC employees protest with black badges

Natyam ad