rto office Khairtabad Fire accident

ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో మంటలు

సాక్షి

Date :24/01/2018

సాక్షి, హైదరాబాద్‌: ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా కార్యాలయంలోని ఓ బిల్డింగ్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి. సిబ్బంది గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న రెండు ఫైరింజన్లు మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదంలో పెద్ద మొత్తంలో రికార్డులు తగలబడుతున్నట్టు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *