నవంబర్ 23 తేదీ న “రూల్” మూవీ పోలింగ్…     

Date:19/11/2018
శ్రీ సుదర్శన చక్ర క్రియేషన్స్ పతాకంపై శివ , సోనా పటేల్ హీరో హీరోయిన్లుగా పైడి రమేష్ దర్శకత్వంలో పైడి సూర్య నారాయణ నిర్మిస్తున్న చిత్రం రూల్ ( ది పవర్ అఫ్ పీపుల్ ) ఈ చిత్రం నవంబర్ 23 న విడుదలవుతున్న సందర్భంలో చిత్ర యూనిట్ తెలుగు ఫిలింఛాంబర్ లో ప్రెస్ మీట్ నిర్వవించింది.  ఈ సందర్భంగా దర్శకుడు పైడి రమేష్ మాట్లాడుతూ… రూల్ ( ది పవర్ అఫ్ పీపుల్ ) ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆడియోను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు,దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు మోషన్ పోస్టర్ ను, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఫస్ట్ లుక్ ను, ప్రొడ్యూసర్ అశ్వినిదత్ టీజర్ ను, డైరెక్టర్ బోయపాటి శ్రీను ట్రైలర్ ను లాంచ్ చేసారు. ఇంత  మంది సినీ రాజకీయ ప్రముఖులు నన్నూసపోర్ట్ చేసినందుకు అందరికి ధన్యవాదాలు, కథ విషయానికి వస్తే హీరో ఒక యువజన నాయకుడు తన కుటుంబంతో పాటు ఎన్నోకుటుంబాలకు అన్యాలను ఏ నిరుపెదలకు జరగకుండా ఎలా ఆదర్శవంతుడిగా నిలిచాడన్నది ఈ చిత్ర కథాంశం , చిత్రంలో నాలుగు పాటలున్నాయి , రమణ సాయి ని సంగీత దర్శకుడి పరిచయం చేస్తున్నాం, హైదరాబాద్ , వైజాగ్ , అరకు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశామన్నారు.      నిర్మాత పైడి సూర్య నారాయణ మాట్లాడుతూ…   ఆవేశం కంటే ఆలోచనలు ముఖ్యమనీ , మనీ కంటే మనుషుల విలువలు ముఖ్యమనీ తెలియజేసే మంచి మెసేజ్ చిత్రాన్ని నిర్మిచానని , ఫస్ట్ కాపీ చూసిన తర్వాత చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా, తెలంగాణ ఎలక్షన్స్ టైములో మా రూల్ చిత్రం విడుదల కావటం సంతోషంగా ఉందన్నారు. హీరోయిన్ సోనా పటేల్ మాట్లాడుతూ… చాలా మంచి కాన్సెప్ట్ ఉన్న చిత్రం ఇది. నాకు మంచి పంచ్ డైలాగ్స్ ఇచ్చారు. నా క్యారెక్టర్ తో పాటు సినిమా కూడా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నా అన్నారు.     హీరో శివ మాట్లాడుతూ.. కెమెరా మెన్ గా ఉన్న నన్నుఈ సినిమాలో హీరోను  చేశారు డైరెక్టర్. ప్రజలకు ఉపయోగడే చిత్రం. తప్పకుండా సినిమా చూసి ఆదరించాలని కోరుతున్నా అన్నారు.  ఇంకా ఈ చిత్రంలో మురళీధర్ గౌడ్ ,  కృష్ణ మోహన్ రెడ్డి ,అది కేశవుల నాయుడు , తనూజ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : బాలా , ఎడిటింగ్ : అజీజ్ , సంగీతం : రమణ సాయి , సహా నిర్మాత : పాంగ కోదండ రావు ,నిర్మాత : పైడి సూర్య నారాయణ , కథ ,మాటలు ,స్క్రీన్ ప్లే : పైడి రమేష్.
Tags:”Rule” Movie Polling on November 23rd …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *