తిరుపతిలో వందకోట్లతో రస్నా ఫ్యాక్టరీ

Date:16/03/2018
తిరుపతి ముచ్చట్లు:
“ఐ లవ్ యు రస్నా”… ఈ మాట తెలీని వారు ఉండరు. అంతటి బ్రాండ్ “రస్నా” ది.. అయితే ఇప్పుడు ఈ “రస్నా” ప్రొడక్ట్స్ మన ఆంధ్రప్రదేశ్ లో నే తయారు కాబోతున్నాయి.ప్రముఖ పండ్ల రసాల తయారీ సంస్థ రస్నా సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దేశంలో 10వ ప్లాంటును, దక్షిణ భారత దేశంలో మొదటిసారిగా, చిత్తూరు జిల్లాలో రూ.100 కోట్లతో పౌడర్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త ప్లాంట్‌తో అదనంగా 20 శాతం ఉత్పత్తి సాధించవచ్చని అంచనా వేస్తున్నారు.రస్నా త్వరలో ఆఫ్రికా దేశంలో తమ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తోంది. దేశీయ మార్కెట్లో కూడా త్వరలో కొత్త ఫ్లేవర్లను విడుదల చేయనుంది. ఇప్పటికే బంగ్లాదేశ్‌, ఈజిప్టు వంటి ప్రాంతాల్లో కేంద్రాలు ఉన్నాయని, త్వరలో ఆఫ్రికాలో యూనిట్‌ను ప్రారంభించనున్నామని రస్నా సంస్థ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరక్టర్‌ పిరూజ్‌ కమ్‌బట్టా తెలిపారు.దేశీయ మార్కె ట్లో అత్యధికంగా సిట్రస్‌ ఆధారిత పానీయాలే అధికంగా వినియోగిస్తారని, ఇవి నాన్‌-కార్బొనేటెడ్‌ బెవరేజస్‌గా పరిగ ణించబడతాయని పేర్కొన్నారు.
Tags: Rusna factory with 100 crores in Tirupati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *