తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి

తిరుమల ముచ్చట్లు:
 
తిరుమల శ్రీవారిని పలువులు ప్రముఖులు దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఏపి ప్రభుత్వ సలహదారుడు  సజ్జల రామకృష్ణ రెడ్డి, ఏపి డెప్యూటీ
సీఎం నారాయణ స్వామి లు స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు
వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు..అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన సజ్జల రామకృష్ణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన, కోవిడ్ కారణంగా ఆర్ధికంగా కృంగి
పోయిన రాష్ట్రంలో ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు..ఎంత ఇబ్బంది ఉన్న సీఎం జగన్ సరైన మార్గంలో అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారన్నారు..ఆర్ధిక పరమైన ఇబ్బందుల్లో
వెసులుబాటు దొరికితే..ఏపి దేశంలోనే ప్రధమ స్ధానంలో నిలుస్తుందన్నారు..అయితే విభజన సమయంలో కేంద్రం ఇచ్చినా హామీలు నేర్చాలని ఆయన తెలియజేశారు.. అనంతరం డెప్యూటీ సీఎం నారాయణ
స్వామి మాట్లాడుతూ.. పేదల పాలిట పెన్నిధి సీఎం జగన్ అని,సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన నిధులు,విభజన హామీలు అమలు చేయాలని, ఏపిలో ఎల్లప్పుడూ జగన్ నే సీఎంగట ఉండాలని స్వామి
వారిని ప్రార్ధించినట్లు తెలిపారు..
 
Tags: Sajjala Ramakrishna Reddy, State Government Adviser, visited Thirumala Srivastava

Natyam ad