Sale subsidy tractors (Warangal rural)

 అమ్మకానికి సబ్సిడీ ట్రాక్టర్లు (వరంగల్ రూరల్)

Date:19/06/2018
పరకాల ముచ్చట్లు:
అన్నదాత కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ట్రాక్టర్లు పలుకుబడి, అగ్రనేతలకు అనుయాయులుగా ఉన్నవారికే అందివ్వడంతో లక్ష్యం నీరుగారుతోంది. సబ్సిడీపై పొం దిన ట్రాక్టర్లను కొందరు ఇప్పుడు అమ్మకానికి పెడుతున్నారు. రెండున్నర ఎకరాల భూమి కలిగి ఉండి ఎడ్లు, ఎవుసం లేని రైతులకు ట్రాక్టర్లను అందిస్తే రైతుకు అన్ని రకాలుగా స హకరింస్తుందనే లక్ష్యంతో ప్రభుత్వం అందిస్తు న్నా సబ్సిడీ ట్రాక్టర్లు పక్కదారి పడుతున్నా యి. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మూడు దఫాలుగా సబ్సిడీ ట్రాక్టర్లను అందించారు. స్థానిక ప్రజాప్రతినిధుల ఆదేశాల మేరకే ట్రా క్టర్లను ఇచ్చారు. ముఖ్యంగా సర్పంచ్‌లకు, ఎం పీటీసీలకు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు మాత్రమే ట్రాక్టర్లు వచ్చాయి. అర్హులైన ఏ ఒక్క రైతుకు కూడా సబ్సిడీ ట్రాక్టర్‌ అందలేదు. ఇదేమిటని ప్రశ్నిస్తే వీరు రైతులు కాదా, వీరికి భూమి లేదా అంటూ ప్రజాప్రతినిధులు అధికారుల మీదికి గుర్రయ్యారు. ఒకవేళ తమకు అనుకూలమైన వ్యక్తికి భూమి లేకపోతే బినామీ పేర్లపై ట్రాక్టర్లను అందించారు. రానురాను రాష్ట్రంలో దుక్కిదున్నేందుకు దుక్కిటెద్దులు కనిపించకుండా పోతున్నాయి. ప్రతీ అంగడికి రైతులు పెట్టుబడుల కోసం పశుగ్రాసం దొరకక పశువులను అమ్మేస్తున్నారు.
ఆరుగాలం కష్టపడి ప్రతి ఒక్కరికీ అన్నం మెతుకులు అందించే రైతన్నకు ప్రతిచోట క ష్టాలే ఎదురవుతున్నాయి. ప్రభుత్వం రైతుల కు ఎంతో కొంత మేలు చేద్దామనుకున్నా ప్ర జాప్రతినిధులు ప్రభుత్వ ఫలాలలను రైతుల వరకు చేరనివ్వడం లేదు. అర్హులైన రైతులకు సబ్సిడీ ట్రాక్టర్లు అందించినట్లయితే దుక్కి దున్నాలన్నా, నాటు వేయాలన్నా, విత్తనాలు నాటాలన్నా ప్రతీది యంత్రాలతోనే సాగు చేస్తారు. కూలీల కొరత పెరిగిపోవడంతో రైతులు కూడా యంత్రాలకే ప్రాధాన్యమిస్తున్నారు. సబ్సిడీ ట్రాక్టర్లు అందకపోవడంతో రైతులు అద్దె ట్రాక్టర్ల కోసం పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వం అందించే సబ్సిడీ ట్రాక్టర్లతో అర్హులైన రైతులకు ఒరిగిందేమి లేదు.
ట్రాక్టర్‌పై ప్రభుత్వం రూ.3.50లక్షల వరకు సబ్సిడీ ఇచ్చింది. ఈ సబ్సిడీ కోసం సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ట్రాక్టర్లు తమకే కావాలంటూ ఎమ్మెల్యేలకు మొరపెట్టుకొని సబ్సిడీ ట్రాక్టర్లను పొందారు. జిల్లాలో మూడు దఫాలుగా ఇప్పటి వరకు 450 ట్రాక్టర్లను అందించారు. ప్రతీ ట్రాక్టర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నాయకులకే ముట్టింది. రూ.3.50లక్షలలో చెరిసగం సబ్సిడీ తీసుకుందామంటూ అమ్ముకునే నాయకులకు రూ.1.75లక్షలు కొనేవారికి రూ.1.75లక్షలు అని బేరం కుదుర్చుకుంటున్నారు. మరికొంతమంది నాయకులు కొనుగోలుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో సబ్సిడీలో రూ.50వేలు అని కొందరు, రూ.లక్ష ఇచ్చినా పర్వాలేదని మరికొందరు అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని గ్రామాల్లో ఒకటి, రెండు ట్రాక్టర్లు అమ్మినప్పటికీ చెరిసగం నడుపుకుంటున్నామంటూ పైపై మాటలు చెబుతున్నారు. ఏదిఏమైనా రెండు మూడు నెలల్లో 70శాతం వరకు సబ్సిడీ ట్రాక్టర్లు అమ్ముడుపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
గతంలో రైతు తన వ్యవసాయ భూమిని దుక్కి చేసుకోవాలంటే గ్రామానికి ఒకటి లేదా రెండు ట్రాక్టర్లు ఉండేవి. ట్రాక్టర్‌ కోసం పొద్దంతా ఎదురు చూసినా రెండు మూడు రోజులకు తమ వంతు వచ్చేది కాదు. డబ్బు చేతిలో పెట్టి ట్రాక్టర్‌ యజమానిని బతిమిలాడాల్సిన పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు సబ్సిడీ ట్రాక్టర్లు ప్రతి గ్రామానికి మూడు నుంచి 30వరకు అందించారు. గతంలో ఒకటి రెండు ట్రాక్టర్లకు నలుగురు ఐదుగురు డ్రైవర్లు ఉండేవారు. ఇప్పుడు ట్రాక్టర్లు విచ్చలవిడిగా కావడంతో డ్రైవర్ల కొరత ఏర్పడింది. లక్షల రూపాయలు వెచ్చించినా కూడా ఏడాదిపాటుగా ఒక్క డ్రైవర్‌ పనిచేయడం లేదు. 50శాతం సబ్సిడీపై వస్తుందనే మోజుతో ప్రజాప్రతినిధులే ముందు పడి సబ్సిడీ ట్రాక్టర్లను తీసుకున్నారు. దీంతో ప్రతి ట్రాక్టర్‌కు డ్రైవర్‌ అవసరం పడ్డాడు. సబ్సిడీ ట్రాక్టర్లు తీసుకున్న కొందరు డ్రైవర్లు దొరకక ఇంటిముందే ట్రాక్టర్‌ను వృథాగా పెట్టుకుంటున్నారు.
Tags:Sale subsidy tractors (Warangal rural)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *