మేడారం జాతర మొత్తం ఆదాయం ఎంతంటే?

వరంగల్: సమ్మక్క-సారలమ్మ జాతరలో మొత్తం రూ.11,45,34,526 ఆదాయం వచ్చినట్లు మేడారం దేవాలయ కార్యనిర్వాహణ అధికారి రాజేంద్రం తెలిపారు. జాతరలో ఏర్పాటు చేసిన హుండీ, తిరుగువారంలో వచ్చిన 517 హుండీలను హనుమకొండలోని తితిదే కల్యాణ మండపంలో లెక్కించారు. 10 రోజుల పాటు సాగిన ఈ లెక్కింపు ప్రక్రియ సోమవారంతో ముగిసింది. 631 గ్రాముల బంగారం, 48.350 కిలోల వెండి ఆభరణాలు వచ్చాయని ఈవో తెలిపారు. ఈ-హుండీ ద్వారా రూ.3 లక్షలతో పాటు విదేశీ కరెన్సీ నోట్లను భక్తులు కానుకలుగా సమర్పించారని పేర్కొన్నారు. 2020-జాతరలో రూ.11.64 కోట్ల ఆదాయం వచ్చింది..

Natyam ad