హైటెక్‌ తరహాలో ఇసుక రవాణ

Date:14/02/2018
నిజామాబాద్ ముచ్చట్లు:
హైటెక్‌ తరహాలో ఇసుకను రవాణా చేస్తున్న నలుగురిని అరెస్టుచేసి కేసులు నమోదుచేశారు. నిజామామాద్ జిల్లా బీర్కూర్ మండలకేంద్రంలోని మంజీరానది తీర ప్రాంతం నుంచి లారీల్లో కిందిభాగంలో ఇసుక పైభాగంలో సింమెట్‌ బస్తాలు నింపి తరలిస్తున్నారు. తిమ్మాపూర్‌ గ్రామంలో బీర్కూర్‌ పోలీసులు పెట్రోలింగ్‌ చేస్తుండగా లారీని పట్టుకున్నారు. కొన్ని రోజులనుంచి మెదక్‌ జిల్లా నిజాంపేట్‌ లారీలతో మంజీరనది నుంచి అక్రమంగా ఇసుకను హైదరబాద్‌కు తరలిస్తున్నారు. బీర్కూర్‌కు చెందిన ఇద్దరు, నిజాంపెట్‌కు చెందిన ఇద్దరు కలసి వ్యాపారం చేస్తున్నారు. వీరిపై ప్రజా ధనం దుర్వినియోగం కింద కేసులు నమోదు చేశారు. ఇందులో ఇద్దరిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. లారీపై భాగంలో ఇసుకతో నిండిన సింమెట్‌ బస్తాలు పెట్టి కింది బాగంలో ఇసుకను రవాణ చేస్తున్నారు. ఎవరైనా చూస్తే సింమెట్‌ బస్తాల రవాణ లారీలా ఉంటుంది. రాత్రివేళల్లో పోలీస్‌ స్ఠేషన్‌ ముందు నుంచే ఈ వ్యాపారం కొనసాగుతోంది.
Tags: Sand movers in high-tech style

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *