Sankranthi Festivals

సంక్రాంతి పండుగ సరదాలు…

Date : 09/01/2018

హైదరాబాద్‌ ముచ్చట్లు:

వాకిట్లో రంగుల ముగ్గులు… ఇంటి ముంగిట పచ్చని తోరణాలు… ఇంటి నిండా బంధువులు… చిన్నపిల్లల ఆటపాటలు… పెద్దల సరదాలు… ఘుమఘుమలాడే పిండి వంటలు… వెరసి సంక్రాంతి సంబరాలు. మరో నాలుగు రోజుల్లో వచ్చే పెద్ద పండుగకు పల్లెలు, పట్టణాలు సన్నద్ధమవుతున్నాయి. తెలుగువాళ్ల సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దం సంక్రాంతి పండుగ. ఏపీలో ఈ పండుగకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. రైతులు ఏడాది పాటు కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయాన ఈ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వారం రోజుల పాటు ఈ పండుగ సంబరాలు సాగుతాయి. పెద్దలు, పిల్లలు, మహిళలు, యువతీయుకులు కొత్త బట్టలు ధరించి ఆనందంగా ఆటపాటల్లో మునిగితేలుతారు. ఎక్కడెక్కడో ఉండే బంధువర్గం ఒకచోట చేరుకుని తమ అనుభవాలను, జ్ఞాపకాలనూ నెమరవేసుకుంటారు.

Tags : Sankranthi Festivals

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *