నెల్లూరులోనే సర్వేపల్లిని కొనసాగించిన జగనన్నకు సర్పంచుల ధన్యవాదాలు.

సర్వేపల్లి ముచ్చట్లు:
నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, టి.పి.గూడూరు మండల జెడ్పీటీసీ సభ్యురాలు, గ్రామ పంచాయతీ సర్పంచులు విలేకర్ల సమావేశం నిర్వహించి, సర్వేపల్లిని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, కృషి చేసిన గోవర్ధన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరి ఇంటిబిడ్డ గోవర్ధనన్న విన్నపాన్ని మన్నించి,సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగించిన జగనన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
ప్రజా సంక్షేమ పాలనకు చిరునామాగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అన్నారు.సర్వేపల్లి ప్రజలకు ఎల్లవేళలా ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న మా ఇంటి బిడ్డ మా గోవర్ధనన్న అని అన్నారు.జగనన్న అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు, గోవర్ధనన్న చేస్తున్న సేవకు ప్రజలు మమ్మల్ని ఎన్నుకోవడం జరిగిందన్నారు. గోవర్ధనన్న తమ చేతలతో చూపిస్తూ, గ్రామాలలో పెద్దఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పండుగ వాతావరణాన్ని నెలకొల్పాడని ఆయన సేవలను కొనియాడారు.గ్రామాలలో నిత్యం పర్యటిస్తూ, ప్రజలకు ఇబ్బంది కలగనివ్వకుండా చూసుకుంటున్నాడని తెలియజేశారు.జిల్లాల పునర్విభజనలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా విభజిస్తానని హామీచ్చిన జగనన్న జిల్లా పునర్విభజన చేయడం మాలో ఆందోళన కలిగిందన్నారు.సర్వేపల్లి నియోజకవర్గం తిరుపతి పార్లమెంటులో ఉన్నందున మేము బాలాజీ జిల్లాలోకి వెళ్లిపోతామనుకున్నాం అని బాధను వ్యక్తపరిచారు.
పక్కనే ఉన్న నెల్లూరు జిల్లాకు అలవాటుపడడంతో, బాలాజీ జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు సముఖత చూపక, గ్రామాలు అభివృద్ధిలో వెనుక పడేవన్నారు. సర్వేపల్లి ప్రజల ఇంటిబిడ్డగా, అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొనే సమస్యలను మన ప్రియతమనేత జగనన్నకు విన్నవించి, ఒప్పించి సర్వేపల్లిని నెల్లూరు జిల్లాలోనే కొనసాగేలా కృషి చేశారని తెలిపారు.సర్వేపల్లి ప్రజలు అడగకముందే, వారి ఇబ్బందులు, సమస్యలను తీర్చే గోవర్ధనన్నే మాకందరికి ఆదర్శం అని అన్నారు.సర్వేపల్లిని నెల్లూరు జిల్లాలో కొనసాగించిన జగనన్నకు, మేము అడగక మునుపే మనందరి పక్షాన మన ఇంటిబిడ్డలా నెల్లూరు జిల్లాలో కొనసాగేలా కృషి చేసిన గోవర్ధనన్నకు సర్వేపల్లి ప్రజలు ఎప్పటికీ ఋణపడి ఉంటార అని తమ అభిప్రాయాలు వ్యక్తపరిచారు.
 
Tags:Sarpanchs thank Jagannath for continuing Sarvepalli in Nellore

Natyam ad