sbi frauds on hidden chargessbi frauds on hidden charges

హిడెన్‌ ఛార్జీల పేరిట ఎస్‌బీఐ భారీ మోసం

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌లో మోసం

వినియోగదారుడికి తెలియకుండానే తన ఖాతా నుంచి అకౌంట్‌ స్టేట్‌మెంట్‌ పేరిట పైసలు వసూలు

కోర్టుకు వెళ్లిన వినియోగదారుడు, కేసు నమోదు చేసిన కుషాయిగూడ పోలీసులు

హైదరాబాద్‌ ముచ్చట్లు:

ప్రభుత్వరంగ బ్యాంక్లు వినియోగదారుల ఖాతాల నుండి హిడెన్(లెక్కలు చెప్పని) చార్జీల రూపంలో విపరీతంగా కట్ చేస్తున్నాయి. కొన్నిసార్లు డబ్బులు ఎందుకు కట్ చేస్తున్నారో బ్యాంకు అధికారులకే తెలియవు. ఇటీవల క్రిష్ణ మోహన్ శర్మ అనే వ్యక్తి ఖాతాలో నుంచి 150 రూపాయలు కట్ అయినట్లు ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో వెంటనే అనుమానం వచ్చిన క్రిష్ణ మోహన్‌ శర్మ, తన ఖాతా ఉన్న ఎస్‌బీఐ బ్యాంకు ఏ.ఎస్‌.రావు నగర్ బ్రాంచ్‌కి వెళ్లి వివరణ కోరాడు. కానీ బ్యాంకు అధికారులు అతనికి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఈ విషయంపై వెంటనే క్రిష్ణ మోషన్‌ శర్మ “బ్యాంకింగ్ అంబుడ్స్‌మెన్‌”కు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుపై స్పందించిన బ్యాంక్ అధికారులు అకౌంట్ స్టేట్‌మెంట్‌ కోసం రూ.150 కట్ చేసినట్లు తెలిపారు.

అసలు తమ దగ్గర అకౌంట్ స్టేట్‌మెంట్‌ తీసుకోలేదని చెప్పినా అధికారులు పట్టించుకోలేదు సరి కదా ఏమైనా చేసుకోమంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. బ్యాంకు అధికారుల ఈ నిర్లక్ష్యపూర్వక సమాధానంపై అతను రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో కూడా ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ ఉపయోగం లేకపోవడంతో క్రిష్ణ మోహన్‌ కోర్టును ఆశ్రయించాడు. హిడెన్ చార్జీల రూపంలో అర్థం పర్థం లేని చార్జీలను కస్టమర్ల అకౌంట్ల నుండి కట్ చేస్తున్నారని, ఇది తన ఒక్కడి సమస్య కాదని ప్రతి వినియోగదారుడికి ఇటువంటి అనుభవాలే ఎదురవుతున్నాయని తన ఆవేదనను వెల్లబుచ్చాడు. కోర్టు వెంటనే ఎస్‌బీఐ బ్యాంక్ ఏ.ఎస్‌.రావు నగర్ బ్రాంచ్ అధికారులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని కుషాయిగూడ పోలీసులను ఆదేశించింది.

Tags: sbi fraud,hidden charges,krishna mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *