డీకే అరుణ కుమార్తెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

హైదరాబాద్ ముచ్చట్లు:
 
తెలంగాణ బీజేపీ నాయకురాలు డీకే అరుణ కుమార్తెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. కోర్టు ఆదేశంతో డీకే శృతి రెడ్డి, మరో అమ్మాయి వినోద లపై కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. ఎలీషా బాబు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు వీరిద్దరిపై ఐపీసీ 323,336,341,384,448,506 R/W 34…..SC, ST, POA Act కి 3(C),3(r),3(s)సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బంజారాహిల్స్‌లోని పీవీపీ ఇంటి కాంపౌండ్ వాల్ నిర్మాణం పనులు చేస్తున్న తమతో శృతి రెడ్డి వాగ్వాదానికి దిగారని, ఆ సందర్భంగా తమను దూషించారని ఎలీషా బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులకు వ్రాతపూర్వకంగా పిర్యాదు చేసిన ఎలీషా బాబు.. పోలీసులకు పక్కా ఆధారాలు సమర్పించారు. ఎలీషా బాబు ఫిర్యాదు ఆధారంగా, అతను సమర్పించిన ఆధారాలను పరిశీలించారు. శృతి రెడ్డి, వినోద లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
 
Tags: SC, ST atrocity case against DK Aruna’s daughter

Natyam ad