జగన్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతా: గిడ్డి ఈశ్వరి

అమరావతిముచ్చట్లు:
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని రెండు రోజుల క్రితం వైసీపీ నుంచి టీడీపీలో చేరిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. బుధవారం అమరావతిలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ… పార్టీ కోసం ముడున్నరేళ్లు నేను పడ్డ కష్టం జగన్కు కనిపించలేదా… నాకు మానసిక క్షోభ మిగిలించారు… అంటూ ఆమె పేర్కొన్నారు. జగన్పై అట్రాసిటీ కేసు పెట్టడమేగాక చానెల్, పత్రికపై కూడా చట్టపరంగా ముందుకు వెళతానన్నారు. అలాగే జగన్కు గిరిజనుల అభివృద్ధి పట్టదని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గిరిజనుల అభివృద్ధికి చాలా చేస్తున్నారని ఆమె అన్నారు.
Tag:SC, STI attachment case against Jagan: Gaddy Ishwari


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *