School bus-auto murders kill two

స్కూలు బస్సు-ఆటో ఢీ..ఇద్దరు మృతి

Date:25/01/2018

కృష్ణా ముచ్చట్లు:

కృష్ణా జిల్లా కోడూరు మండలం నారేపాలెం -పిట్టలంక గ్రామాల మధ్య స్కూల్ బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను ఢి కొట్టింది. దాంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు బత్తుల మేరిమ్మ( 55), కొల్లబత్తిన లక్ష్మీ (40) మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. బస్సులోని పలువురు స్కూల్ విద్యార్దులకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆటోలోని వాళ్లంతా వ్యవసాయ కూలీ పనుల కోసం సాలెంపాలెం నుండి విజయవాడ దగ్గర పెదపులిపాకకు ఆటోలో వెళుతుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులు బెజవాడ రవి(29) ఆటో డ్రైవర్, కొప్పనాతి ధనలక్ష్మి (47), కొప్పనాతి వరలక్ష్మి (40), కొప్పనాతి వెంకటేశ్వరమ్మ 44, కొప్పనాతి జ్యోతి 40, విశ్వనాధపల్లి సుజాత21, వల్లభనేని నాగమణి (40) లను అవనిగడ్డ ఆసుపత్రికి తరలించారు.తీవ్రగాయాలయిన ఇద్దరిని విజయవాడకు పంపించారు. బస్సు అవనిగడ్డలోని విద్యానికేతన్ స్కూల్ కు చెందినదని పోలీసులు తెలిపారు.

Tags : School bus-auto murders kill two

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *