తిరుమల శ్రీ వరహస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా ప్రత్యేక సహస్ర కళశాభిషేకం
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీ వరహస్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం మండళాభిషేకం సందర్భంగా స్వామివారికి ఏకాంతంగా ప్రత్యేక సహస్ర కళశాభిషేకం, కల్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ వరహస్వామివారి విమాన గోపురానికి బంగారు తాపడం చేసి సంప్రోక్షణ చేసిన విషయం విదితమే.సంప్రోక్షణ చేసి మండళం ( 48 రోజులు) పూర్తయిన సందర్భంగా ఉదయం 7 నుండి 9 గంటల వరకు స్రత్యేక సహస్ర కళశాభిషేకం, ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవార్లకు కల్యాణం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Scientific special anointing ceremony at Thirumala Sri Varahaswamy Temple