స్కూటర్ ను డీకొన్న లారీ  – ముగ్గురు మృతి 

శ్రీకాళహస్తి  ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని ఏంపేడు గ్రామం వద్ద స్కూటర్ ను లారీ డీకొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఇదే మండలం వాగివేడు గ్రామానికి చెందిన చంద్రమౌళి(24), సోమశేఖర్(20), వెంకటేష్ (18)లు స్వగ్రామం నుంచి మోటారు సైకిల్ పై నెల్లూరు జిల్లా వెంకటగిరికి వెళ్తుండగా ఏంపేడు గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న మినీ లారీ వారు ప్రయాణిస్తున్న స్కూటర్ ను డీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Tag : Scooter is a lorry – Three killed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *