తెర పైకి  భాషా పరిరక్షణ అంశం (విశ్లేషణ)

Date:14/02/2018
హైదరాబాద్‌ ముచ్చట్లు:
రానున్న శాసనసభ ఎన్నికల్లో కన్నడ భాషా పరిరక్షణ అంశం కీలక పాత్ర పోషిస్తుందా? స్థానికులు మాత్రం ఈ అంశం ప్రధానమైనదని అంటున్నారు. కన్నడ ఇప్పటికే ఎన్నికల అంశంగా మారిందని ప్రముఖ పాత్రికేయుడు రామకృష్ణ ఉపాధ్యాయ అన్నారు. కన్నడ ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్లను కాదనలేమని నాయకులు అంటున్నారు. ప్రజల మనోభావాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే కన్నడ పరిరక్షణకు ఏమి చేస్తామో రాజకీయ పార్టీలు చెప్పవలసి వస్తున్నది. బీజే పీ మొదట ఈ కన్నడ ఉద్యమకారులను కాంగ్రెస్ ఏజెంట్లని ఆరోపించిం ది. కానీ ఉద్యమం తీవ్రతరం కావడంతో మౌనం వహిస్తున్నది. కన్నడ అంశంపై వ్యతిరేకంగా మాట్లాడవద్దని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప కార్యకర్తలను ఆదేశించారు. బెంగుళూరు కన్నడిగలు ప్రాబ ల్యం గల నగరం కాదని ఒక అబద్ధం ప్రచారమవుతున్నది. బెంగుళూరు ను మరో ముంబయిగా మార్చాలనే కుట్రదారులు ఈ ప్రచారం చేస్తున్నా రు. బెంగుళూరులో ఇప్పటికీ అరువైశాతం మంది కన్నడ మాతృభాష గలవరే. 75 నుంచి 80 శాతం మంది కన్నడ భాషను అర్థం చేసుకోగలరు. హిందీ భాష వల్ల ఏర్పడిన ముప్పును వారు క్రమంగా గ్రహిస్తున్నారు. వీరంతా ఏకతాటిపైకి వచ్చి, కన్నడను పరిరక్షించే పార్టీలకే ఓటు వేస్తామని ప్రకటిస్తే, అంతా దారికొస్తారు అని చంద్రశేఖర పాటిల్ అన్నారు. పాటిల్ 2008లో కన్నడ నినాదంతో అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయారు. రహదారులు, ఇండ్లు, ఆరోగ్యం వంటి అంశాలు ఎన్నికలలో కీలకమైనవి. వీటితో పాటు ఇప్పుడు కన్నడ అంశం కూడా ప్రధానమైందిగా మారింది. కర్ణాటకను పాలిద్దామని అనుకునేవారు ఈ అంశాన్ని పట్టించుకోకతప్పదు.కేంద్రం హిందీ భాషను రుద్దుతున్నదంటూ గతేడాది జూలైలో సోషల్ మీడియాలో తీవ్ర చర్చసాగింది. బెంగుళూరు మెట్రో లో హింది సంకేతాలు ఈ చర్చకు పురిగొల్పాయి. మొదట ఇది డిజిటల్ వేదికపై చర్చకు మాత్రమే పరిమితమైంది. అధికారులు పెద్ద గా పట్టించుకోలేదు. కానీ నెలరోజుల్లో ఈ ప్రచారం ఉధృతం కావడంతో, సిద్ధరామయ్య ప్రభుత్వం స్పందించక తప్పలేదు. స్థానిక కన్నడ టీవీ చానె ల్స్ ఈ వివాదాన్ని పెద్దగా చేసినయి. మెట్రో స్టేషన్ల నుంచి హిందీ బోర్డులను తీసివేయాలని దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. దీం తో కన్నడ ఉద్యమకారుల దృష్టిలో సిద్ధరామయ్య హీరోగా మారిపోయా రు. ట్విటర్, ఫేస్‌బుక్‌లలో హిందీని రుద్దడాన్ని అడ్డుకుందామనే పోకడ పెరిగిపోయింది. ఇది అనుకోకుండా తలెత్తిన ఉద్యమమనే భావన ఉన్నది. కానీ కొత్తగా కన్నడ భాషా ఉద్యమాన్ని ప్రాపంచిక దృక్పథం ఉన్న విద్యావంతులైన యువకులు నడుపుతున్నారు. కర్ణాటకలో కన్నడ భాషకు ప్రాధాన్యం పెంచడానికి ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడాలని వీరు పద్ధతి ప్రకారం ప్రయత్నిస్తున్నారు.కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలు తమ మ్యానిఫెస్టోలలో కన్నడ గురించిన వైఖరి వెల్లడిచేయాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. మున్నోట, బనసవి బలగ, కన్నడ గ్రాహక కూట వంటి సంస్థలు, వేదిక లు కన్నడ భాష, కన్నడ ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి కొంతకాలంగా పనిచేస్తున్నాయి. ఒక టెక్నాలజీ కంపెనీలో పనిచేస్తున్న వసంత షె ట్టి మున్నోట వేదికను నడుపుతున్నారు. మూడేండ్లుగా తాము సాగిస్తున్న కృషి ఫలితాన్నిస్తున్నదని షెట్టి అన్నారు. స్వార్థ శక్తులు కన్నడ ఉద్యమాన్ని బదనాం చేస్తున్నాయని కూడా ఆరోపించారు. ఈ వాదనలో వాస్తవం ఉన్నది. ఈ ఉద్యమాన్ని కొందరు డబ్బు సంపాదించుకోవడానికి వాడుకుంటున్నారు. కానీ కన్నడ పరిరక్షణ కోసం బలమైన ఉద్యమం అవసరం. మేం ఈ విషయం గ్రహించి, సొంతగా ఉద్యమాన్ని ప్రారంభించాం. సం ప్రదాయ ఉద్యమకారులకు దూరంగా ఉంటున్న ప్రజలను మేం చేరుకోగలిగాం. కన్నడ ఒక పథకం ప్రకారం దెబ్బకొట్టి హిందీని రద్దే కార్యక్రమం సాగుతున్నదని మేం ప్రజలకు వివరించాం. దీంతో విద్యావంతులలో చైత న్యం వచ్చింది. ఇప్పుడు ప్రతీకాత్మక నిరసనలు లేవు. అసలైన ఉద్యమం మొదలైంది. బెంగుళూరులో, ఢిల్లీలో కన్నడకు గుర్తింపు తీసుకువస్తాం అని షెట్టి వివరించారు. తమది హిందీ వ్యతిరేక ఉద్యమం కాదని వారంటున్నారు. కన్నడను పణంగా పెట్టి హిందీ రుద్దడాన్ని మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని ఉద్యమకారులు చెబుతున్నారు. కొన్ని స్వార్థ శక్తులు మాది హిందీ వ్యతిరేక ఉద్యమమని ముద్ర వేస్తున్నాయి. అది తప్పు. మేం కోరుతున్నది భాషా సమానత్వం. ఇతర భాషలకు కూడా లభించవలసిన అర్హతను పక్కనపెట్టి, హిందీకి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వకూడ దు. హిందీయేతర రాష్ర్టాలలో హిందీ రుద్దవలసిన అవసరం లేదు. హిం దీని హిందీ రాష్ర్టాలలోనే ప్రోత్సహిస్తే మాకేం అభ్యంతరం లేదు. హిందీ రాష్ర్టాలలో కన్నడ, తమిళ భాషలను ప్రోత్సహిస్తున్నారా? కర్ణాటక, తమిళనాడు విషయంలోనే ఇదే ప్రాతిపదిక ఉండాలె అని షెట్టి తమ వాదన ను వివరించారు.ఒకప్పుడు కన్నడ ఉద్యమకారులు చేతిలో కన్నడ జెండా పట్టుకునేవా రు. కానీ ఇప్పటి ఉద్యమకారులు మొబైల్ ఫోన్ పట్టుకొని కన్నడ కోసం పోరాడుతున్నారు. ట్విటర్, వాట్సప్, ఫేస్‌బుక్ ద్వారా ప్రచారం సాగిస్తున్నారు. అయితే వీధిలోకి వచ్చి ఉద్యమించే వారి పాత్ర కూడా ప్రధానమేనని ఐటి నేపథ్యం ఉన్న ఉద్యమకారుడు అరుణ్ జవగళ్ అన్నారు. కర్ణాటక రక్షణ వేదిక (కరవే) వంటి సంస్థల పాత్రను ఉపేక్షించలేమని అన్నా రు. మేం సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజలలో అవగాహన పెంచి, ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. ఈ గ్రూపులు నిరసనలు నిర్వహిస్తాయి, బహిరంగ సభలు జరుపుతయి, ప్రభుత్వానికి బృందాలుగా వెళ్ళి విజ్ఞప్తులు చేస్తాయి. ఒకరికొకరు తోడ్పాటుగా ఉంటాం అని అరుణ్ జవగళ్ వివరించారు. తాము నిరంతరం ప్రచారం చేయడం వల్ల ప్రైవేట్ ఎయిర్‌లైన్స్, కన్జూమ ర్ గూడ్స్ కంపెనీలు, ప్రైవేటు బ్యాంకులు మొదలైనవి కన్నడ పట్ల తమ వైఖరిని మార్చుకున్నాయని జవగళ్ అన్నారు.కన్నడ ఉద్యమానికి కన్నడ అభివృద్ధి సంస్థ  అధ్యక్షుడు ఎస్. జి. సిద్ధరామయ్య, ప్రముఖ కన్నడ రచయిత డాక్టర్ చంద్రశేఖర పాటిల్, సినీనటులు ప్రకాశ్‌రాజ్, ప్రకాశ్ బెలవడి తదితరులు మద్దతు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కూడా కన్న భాషా సంస్కృతులు అంటే మక్కువ. కన్నడ ఉద్యమం రావడంతో ఆయన కూడా భాషా సంస్కృతు ల పరిరక్షణలకు చర్యలు తీసుకుంటున్నారు. హిందీలో బోర్డులు పెట్టడం, ప్రభుత్వ ఉద్యోగాలలో కన్నడిగులకు రిజర్వేషన్లు ఇవ్వడం, కన్నడ జెండా ప్రతిపాదించడం మొదలైన చర్యలు చేపట్టారు. ప్రభుత్వం, నాయకులు సోషల్ మీడియాలో కన్నడ ఉపయోగించడం పెరిగిపోయింది.
Tags: Screen conservation factor (analysis)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *