సెబాస్టియన్ తప్పకుండా విజయవంతమవుతోంది.

సినిమా ముచ్చట్లు:
రాజావారు రాణిగారు సిని మాతో కథానాయకుడిగా పరిచయమై న కిరణ్ అబ్బవరం టాలీవుడ్లో తన కంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. తన రెండో చిత్రం ఎస్.ఆర్. కళ్యాణమం డపంతో కూడా సాలిడ్ సక్సెస్ అందు కున్నారు.క్లాసు-మాసు,యూత్- ఫ్యామిలీ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా మార్చి 4న సెబాస్టియన్ పిసి 524’తో హ్యాట్రిక్ హిట్ అందుకోవడానికి రెడీ అవుతున్నారు. జ్యోవిత సినిమాస్ పతాకంపై ఎలైట్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా, కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దరేకర్) హీరోయి న్లుగా, సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్ నిర్మాతలుగా, బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘సెబాస్టియన్ పిసి524’. ప్రపంచ వ్యాప్తంగా మార్చి 4న సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుద ల చేస్తోంది.ఈ సినిమాను ముందు ఫిబ్రవరి 25న విడుదల చేయాలనుకు న్నారు. కానీ అదే రోజు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా వస్తుండటంతో.. వారం రోజులు ఆగి వస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఇదే విషయాన్ని మొన్న ప్రమోషనల్ వీడియోలో కూడా చెప్పుకొచ్చాడు ఈ హీరో. పవన్ వస్తే తన సినిమా వాయిదా వేసుకుంటామని చెప్పాడు. ఇప్పుడు అన్నట్లుగానే వారం ఆలస్యం గా వస్తున్నాడు కిరణ్.ఈ మూవీ విడుదల సందర్భంగా విశాఖలో హిరో  నిర్మాతలు మాట్లాడుతూ.. రాజావారు రాణిగారు’, ‘ఎస్.ఆర్. కళ్యాణ మండ పం’ చిత్రాల విజయంతో దూసుకుపో తున్న తమకు ‘సెబాస్టియన్ పిసి524’ ఖచ్చితంగా హ్యాట్రిక్ హిట్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
 
Tags:Sebastian is sure to be successful.

Natyam ad