పుంగనూరులో సమస్యల పరిష్కారానికే సచివాలయాలు- చైర్మన్‌ అలీమ్‌బాషా

పుంగనూరు ముచ్చట్లు:
 
ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకే సచివాలయ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా అన్నారు. గురువారం ఆయన, వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర తో కలసి తూర్పువెహోగశాల సచివాలయాన్ని తనిఖీ చేశారు. ప్రజల నుంచి వస్తున్న వినతి పత్రాలు, నమోదు , సర్టిఫికెట్ల పంపిణీ, సచివాలయ ఉద్యోగుల పనితీరును పరిశీలించారు. చైర్మన్‌ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమస్యలు పరిష్కారంలో ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కల్లబొల్లి మాటలతో ప్రజలను సచివాలయాల వద్దకు పిలిపించవద్దన్నారు. ప్రజలకు తమ సమస్యలు గురించి వలంటీర్ల ద్వారా సమాచారం అందించాలని, అన్నింటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. ఈ తనిఖీల్లో సచివాలయ ఉద్యోగులు , వలంటీర్లు పాల్గొన్నారు.
 
Tags Secretariats for problem solving in Punganur – Chairman Aleem Basha

Natyam ad