అడవిలో గంజాయి పట్టివేత, వాలమూరు వద్ద 57 ప్యాకెట్ల గంజాయి.

గోకవరం ముచ్చట్లు:
అటవీప్రాంతంలో దాచిన గంజాయిని అధికారులు పట్టుకున్నారు.. ప్రధాన రహదారికి కొద్ది దూరంలో దాచిపెట్టిన గంజాయి ప్యాకెట్లను గుర్తించారు..57 ప్యాకెట్లు ఉండగా వాటిని మారేడిమిల్లి పోలీసులకు అప్పగించారు.. దీనికి సంబంధించిన వివరాలను వైల్డ్ లైఫ్ రేంజ్ అధికారి వర ప్రసాద్ తెలిపారు..  మారేడిమిల్లి నుండి వాలమూరు వైపు వైల్డ్ లైఫ్ డీఆర్వో వేణు గోపాల్ ఆధ్వర్యంలో వన్యప్రాణుల కోసం పరిశీలన కార్యక్రమం చేపట్టారు.. అధికారులు వెళ్తుండగా చెట్టు పక్క ప్యాకెట్లు ఉండటాన్ని గమనించి, వెళ్లి పరిశీలించారు.. అవి గంజాయి ప్యాకెట్లుగా గుర్తించి, మారేడిమిల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా, పోలీసులు వాటిని స్టేషన్ కి తరలించారు..గంజాయి ప్యాకెట్లు అక్కడికి ఎలా వచ్చాయి, ఎవరు తీసుకువచ్చారు అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు..
 
Tags:Seizure of cannabis in the forest, 57 packets of cannabis at Valamuru

Natyam ad