Seven maoists killed in Maharashtra encounter

మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్ : ఏడుగురు మావోలు మృతి

Date : 06/12/2017
ముంబై ముచ్చట్లు:
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ మండలం జంగనూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. సంఘటనా స్థలంలో ఆయుధాలు, మావోయిస్టుల కిట్ బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నారు. వీరి కోసం బలగాలు గాలిస్తున్నాయి. ఎదురుకాల్పుల నేపథ్యంలో పోలీసులు అక్కడ కూంబింగ్ ముమ్మరం చేశారు.
ఛత్తీస్గఢ్లోనూ ఎన్కౌంటర్
ఛత్తీస్గఢ్లోనూ కొండగావ్లో బుధవారం ఉదయం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఈ ఎదురుకాల్పుల్లో ఒక జవాను గాయపడ్డాడు. గాయపడ్డ జవాన్ను ప్రత్యేక హెలికాప్టర్లో చికిత్స నిమిత్తం రాయ్పూర్ తరలించారు. కొండగావ్లో మావోయిస్టుల కోసం బలగాలు గాలిస్తున్నాయి.
Tags : Seven maoists killed in Maharashtra encounter


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *